చిన్న సినిమాలకు ఊరట!

short films
చిన్న సినిమాలకు థియేటర్స్‌ దిరకడం లేదనే ఆరోపణ ఉంది. అయితే దీనికోసం మినీ థియేటర్లను ఏర్పాటు చేయాలని కొందరు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు వారి ప్రయత్నం ఫలించి ప్రబుత్వం చిన్న సినిమాల     కోసం మినీ థియేటర్లను ఏర్పాటు చేసే పనులు మొదలుపెట్టింది. ఈ సంధర్భంగా సానా యాడిరెడ్డి మాట్లాడుతూ.. గతేడాది చిన్న నిర్మాతలందరం కలిసి మినీ థియేటర్స్‌ అసోసియేషన్‌  ను ఏర్పాటు చేశాం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన మా ఆలోచన బావుందని వెంటనే అమలు చేయమని సూచన లిచ్చారు. 200 సీటింగ్‌ కెపాసిటీ గల మినీ థియేటర్లకు అనుమతిని ఇచ్చి చిన్న సినిమాకు కొత్త ఊపిరి పోశారు. చిన్న సినిమాను బ్రతికించడం కోసం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఐదవ ఆటను తప్పనిసరిగా కేటాయించాలనే నిబంధనను ప్రకటించడం ఆనందంగా ఉంది అని చెప్పారు