చిన్న, మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో ఏడేళ్ల గరిష్ట వృద్ధి

ppf
ppf

చిన్న, మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో ఏడేళ్ల గరిష్ట వృద్ధి

ముంబై: స్మాల్‌, మిడ్‌క్యాప్‌షేర్లు ఈ ఆర్థిక సంవత్సరంలో గడచిన ఏడేళ్లలో ఎన్న డూలేనంత వృద్ధిని నమోదుచేసాయి. రెండో ఆప్షన్‌గా అత్యంత లాభదాయకత ఉన్న షేర్లుగా నిలిచాయి. విదేశీ పోర్టుఫోలి యో ఇన్వెస్టర్లు, దేశీయ మ్యూచువల్‌ఫండ్‌ సంస్థలు కూడా పెట్టుబడులు సుమారుగా లక్షకోట్లకుపైగా ఈ కేటగిరీల్లో కుమ్మరించాయి. ఈ ఏడాది ఎస్‌ అండ్‌ఫి బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్‌సూచ 37శాతం పెరిగింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌ సూచి కూడా 33శాతంపెరిగింది. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ శుక్రవారం 17శాతం వృద్ధి చెందితే స్మాల్‌, మిడ్‌క్యాప్‌సూచీలు మరింత హవా చూపించాయి. 2014లో స్మాల్‌, మిడ్‌క్యాప్‌సూచీలు 53శాతం ర్యాలీతీసాయి. మిడ్‌క్యాప్‌ 30శాతం ర్యాలీతీసింది. బెంచ్‌మార్క్‌ సూచి అప్పట్లో 25శాతం మాత్రమే వృద్ధినమోదు చేసింది. అంతకుముందు 2010లో రెండు సూచీలు కూడా 130శాతంవరకూ పెరిగాయి.

సెన్సెక్స్‌ ఆసమ యంలో కేవలం 81శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేసింది. విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు, దేశీయ ఫండ్‌ సంస్థలు మొత్తంగాచూస్తే లక్షకోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. వీరిలో ఎఫ్‌పిఐలు 55,680 కోట్లు, దేశీయఫండ్‌ సంస్థలు 51,293 కోట్లు పెట్టుబ డులు పెట్టారు. ఈ పెట్టుబడులతో ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీకి ఊతం ఇచ్చి నట్లయింది. 2015మార్చి నుంచి 2017 మార్చివరకూ సంస్థాగత పెట్టుబడుల కంటే దేశీయ సంస్థలనుంచి పెట్టుబడులు ఎక్కువ అందాయి.

దేశీయ సంస్థా గత ఇన్వెస్టర్లనుంచి 15.9 బిలియన్‌ డాలర్లువరకూ అందాయి. విదేశీ సంస్థా గత ఇన్వెస్టర్లనుంచి ఐదు బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు వచ్చాయి. సంస్థాగత పెట్టుబడులపరంగా ఎక్కువ దేశీయ ఇన్వెస్టర్లకే సింహభాగం లభించింది. దీనివల్ల మిడ్‌క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌షేర్లలో ఎక్కువ వృద్ధి నమోదయింది. నిప్టీ సిఎన్‌ఎక్స్‌ మిడ్‌క్యాప్‌సూచి 22శాతం రిటర్నులు ఇచ్చాయి. అదేకాలంలో నిప్టీ 50సూచి 21శాతంపెరిగిందని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ హెడ్‌గౌతమ్‌ దుగ్గద్‌ వెల్లడించారు. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగం నుంచి 862 స్టాక్స్‌ ఉంటే వాటిలో 431 స్టాక్స్‌ మార్కెట్లలో 30 శాతానికిపైగా వృద్ధిని సాధించాయి.

మొత్తం 431 స్టాక్స్‌లో 106 కంపెనీల స్టాక్స్‌ బహుళరెట్లు పెరిగాయి. 19 స్టాక్స్‌ 200శాతంపెరిగాయి. ఆప్‌టెక్‌, ఎస్కార్టులు, టాటామెటాలిక్స్‌, తిరుమలా§్‌ుకెమికల్స్‌, లూమాక్స్‌ ఇండస్ట్రీస్‌, జిఎన్‌ఎఫ్‌సి వంటి సంస్థలు భారీలాభాలతో దూసుకువెళ్లాయి. సిటీగ్రూప్‌ ఆర్థిక వేత్తల అంచనాలప్రకారం మిడ్‌క్యాప్స్‌ ఈ ఆర్థికసంవత్సరంలో మిడ్‌క్యాప్స్‌ వృద్ధి 56శాతంగా ఉంటుందని, 2018లో స్వల్పంగా తగ్గి 40శాతానికి రావచ్చని అంచనా వేసింది. ఎక్కువగా గనులు, టెక్స్‌టైల్‌, విద్యు త్‌, ప్లైవుడ్‌, పెయింట్‌కంపెనీలు, బ్యాటరీ సంబంధిత కంపెనీల స్టాక్‌ కౌంటర్లు పయిగులు తీసాయి. అయితే ఈచిన్న,మిడ్‌క్యాప్‌ కంపెనీల విలువలు ఏమాత్రం శ్రేయోదాయకంగా లేవని, ఇదంతా రిటైల్‌ ఇన్వెస్టర్ల వ్యూహాల్లో భాగంగా ఉంటుందదని, భారీ సంస్థాగత ఇన్వెస్టర్లు రావ డంలేదని ఇక్వినామిక్స్‌ వ్యవస్థాపకులు జి.చొక్క లింగం వెల్లడించారు. ఇక విదేశీ నిధులపరంగాచూస్తే భారీ కంపెనీల్లోనే ఉంటుందని, చిన్న,మిడ్‌క్యాప్‌ విభాగాల్లో ఉండదని అన్నారు.

ఇన్వెస్టర్లు కొన్ని కౌంటర్లలో లాభాల స్వీకరణ తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. 2018 మొదటి త్రైమాసికంలో ఈతీరు వెల్లడి అవుతుందని ఆయన అన్నారు. ఐడిబిఐ క్యాపిటల్‌ ఎకె ప్రభాకర్‌ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. జిఎస్‌టి అమలవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు కూడా ఈ కంపెనీల వైపు ఎక్కువ ర్యాలీ తీసినట్లు వెల్లడించారు. మొత్తం మీద ఏడేళ్ల గరిష్టస్థాయిలో చిన్న,మిడ్‌క్యాప్‌ కంపెనీలు పరుగులు తీసినట్లు స్టాక్‌, ఆర్థికవేత్తల అంచనాలు వెల్లడిస్తున్నాయి.