చిన్న‌త‌నం నుండి అత‌నంటే పిచ్చిః అనుష్క‌

dravid and anushka shetty
dravid and anushka shetty

బెంగుళూరుః క్రికెటర్లకు మన దేశంలో ఉన్న క్రేజే వేరు. తమ ఆటతీరుతో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. యువ ఆటగాళ్లకు మహిళా అభిమానులే ఎక్కువ. తాజాగా టాలీవుడ్‌ భామ అనుష్క తన అభిమాన క్రికెటర్‌ ఎవరో తెలిపింది. తాజాగా అనుష్క ఓ వెబ్‌ పోర్టల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని.. మీ అభిమాన క్రికెటర్‌ ఎవరు అని ప్రశ్నించాడు. దీనికి అనుష్క ‘రాహుల్‌ ద్రవిడ్‌ నా అభిమాన క్రికెటర్‌. నా చిన్నతనం నుంచి అతనంటే నాకు పిచ్చి. ఎంతలా అంటే ఒకానొక సమయంలో ద్రవిడ్‌తో పీకల్లోతు ప్రేమలో పడిపోయా’ అని బదులిచ్చింది.
.