చిన్నారుల మేధో వికాసంపై పొంచి ఉన్న వాయుకాలుష్య ముప్పు

Memory Power Develop
Memory Power

లండన్‌: చిన్నారులు పీల్చే గాలి వారిలో మేధో వికాసంపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది.
జ్ఞాపకశక్తిని కూడా తగ్గిస్తుందని సూచించింది. చిన్నారుల్లో వాయు కాలుష్యం చూపే ప్రభావాలను తెలుసుకునేందుకుగాను స్పెయిన్‌లో
బార్సిలోనా ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ సంస్థ ప్రత్యేక అద్యయనాన్ని నిర్వహించింది. ఇందుకోసం 7-10 ఏళ్ల వయస్సు 1200
మంది చిన్నారులను ఎంచుకుంది. వారి ఇంటి నుంచి పాఠశాలకు, పాఠశాలకు నుంచి తిరిగి ఇంటికి నడిచి వస్తున్నప్పుడు పీలుస్తున్న
గాలి ఏడాదిపాటు విశ్లేషించింది. ప్రధానంగా కలుషిత గాలిలోని సూక్ష్మ, ధూళి పదార్థాలు, నల్లని కార్భన్‌ అణువుల ప్రభావంతో
చిన్నారుల జ్ఞాపకశక్తి ఎదుగుదల తగ్గిపోతున్నట్లు గుర్తించింది. బాలికలతో పోలిస్తే బాలురలో ఈ ప్రభావం మరింత అధికంగగా
కనిపిస్తున్నట్లు తెలిపింది.