చిన్నారులతో ఆప్యాయంగా…

Spend-Quality-Time-with-Your-Child
పిల్లల కోసం ఆస్తులు కూడ బెట్టడం, కోరినవన్నీ క్షణాల్లో సమకూర్చడంతో తల్లితండ్రుల బాధ్యత తీరుతుందని నేడు చాలా మంది ఉద్యోగస్థులైన తల్లితండ్రులు అనుకుంటున్నారు. కాని అలా లేదు నేటి పరిస్థితి. వారి అభిరుచులను ప్రోత్సహించడం, మానసికానందాన్ని కలిగించడం, మేమున్నాం అనే భావనను అందించడం కూడా తప్పనిసరి విధి అయ్యింది. మరి పిల్లలకు నచ్చిన దిశలో మెలుగుతూ, వారిని ఎలా మన బాటలోకి ఎలా తీసుకురావాలో పరిశీలిద్దామా!

ఇద్దరూ ఉద్యోగస్థులు కావడం, కుటుంబ బాధ్యతలు వాటివల్ల ఎదురయ్యే ఒత్తిడితో తల్లిదండ్రులు పిల్లల కోసం కేటాయించే సమయం రానురాను తగ్గిపోతుంది. ఇది పిల్లలకూ, పెద్దలకూ మధ్య దూరం పెంచుతోంది. మానసికంగా ఏర్పడే ఈ అంతరం, భారీ బహుమతులు కొనివ్వడం, పెద్ద స్కూళ్లలో చేర్పించడం, విహార యాత్రలకు పంపడంతో తీరుతుందని చాలా మంది అనుకుంటున్నారు. కాని అది వాస్తవం కాదు. వ్యక్తిత్వ వికాసానికి, మానసిక స్థిరత్వానికి అవి ప్రత్యామ్నాయాలు కావని పలు అధ్యయనాలు వెల్లడించాయి. పిల్లల చదువు, ఆటలు, విజయాలు, వైఫల్యాల్లో తల్లిదండ్రులు పాలుపంచుకోవాలి. దీనివల్ల భావోద్వేగపరంగా చక్కగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతుంది.

అనుబంధాలకు ప్రాధాన్యం : నేడు ఎటుచూసినా పోటీ అన్నది నిజమే. అలాగని ఆ జోరులోనే సాగిపోతూ అనుబంధాలను, బంధుత్వాలను పట్టించుకోకపోతే పదిమందిలో మెలగడం, విభిన్న వ్యక్తిత్వాలను అర్థం చేసుకోవడం పిల్లలకు ఎలా అలవడు తుంది. అయితే చదువు, లేదంటే టీవీలు, సినిమాలు, పిల్లలు ఈ వ్యాపకా ల్లోనే మునిగిపోతే పరిశీలన, ప్రపంచజ్ఞానం ఒంటబట్టవ్ఞ. తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా రోజూ కొంత సమయం కుటుంబానికీ కేటాయించాలి. ఉదయాన్నే వాకింగ్‌కి వెళ్లడం, అందరూ కలసి భోజనం చేయడం, బంధువు లింట్లో ఫంక్షన్లకు హాజరవడం వంటివన్నీ పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో సాయపడతాయి. ఇందుకోసం తల్లిదండ్రులు తమ దైనందిన ప్రణాళికను కొంత మార్చుకోవల్సి రావచ్చు కానీ అలా చేయడం వల్ల ఎన్నో విధాలమేలు.

ఆహ్లాదంతోనే ఆనందం
పని ఒత్తిడి తాలూకూ చిరాకు. కోపాన్ని పిల్లలపై ప్రదర్శిస్తుంటారు కొందరు తల్లితండ్రులు. అది వారిలో అభద్రతాభావాన్ని కలిగిస్తుంది. దాంతో ఏది చెప్పాలన్నా సంశయిస్తారు. పిల్లల్లో ఆ అభిప్రాయం ఏర్పడకుండా ఉండా లంటే, తల్లిదండ్రులు కోపాన్ని నియంత్రించుకోగలగాలి. పిల్లలు తమ మనసు లోని ప్రతి భావాన్ని బయటకి చెప్పాలనుకుంటారు. ఈ విషయాన్ని గమ నించి, వారు చెప్పేవి సహనంగా వింటూ, అవసరమైన సలహాలనిస్తుంటే వారికి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అది వారిలో చెప్పలేనంత భరోసాను నింపుతుంది. ఎన్ని చిరాకులున్నా ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావ రణాన్ని సృష్టించడం తల్లిదండ్రుల బాధ్యత. మంచి తల్లితండ్రులు మాత్రమే గొప్ప బిడ్డలను తయారుచేయగలరు. సంతోషంగా గడిపే భార్యాభర్తలే పిల్లలు చురుగ్గా ఉండేందుకు కారణమవుతారని నిపుణుల అభిప్రాయం.

ఆంక్షలు తగ్గిస్తూనే : ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు పిల్లలు తప్పటడుగులు వేస్తుంటారు. అందుకే స్నేహితుల గురించి, పాకెట్‌మనీని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు. వంటివన్నీ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకోవాలి. అలాగని అతిగా ఆంక్షలు విధిస్తే అసలుకే వినడం మానేస్తారు. సున్నితంగా వ్యవహరిస్తూనే క్రమశిక్షణ అలవాటు చేయాలి. చదువుతో పాటు అదనంగా నేర్చుకునే వ్యాపకాలు ఈ రోజుల్లో ఎన్నో ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ల అభిప్రాయాలను పిల్లలపై రుద్ద కూడదు.