చినజీయర్‌ స్వామికి తృటిలో తప్పిన ప్రమాదం

Chinajeeyar swamy
Chinajeeyar swamy

హైదరాబాద్‌: వైకుంఠ ఏకాదశి రోజున చినజీయర్‌ స్వామికి కొద్దిపటిలో ప్రమాదం తప్పింది. నగరంలోని కొత్తపెటలో గల అష్టలక్ష్మీ ఆలయంలో ఆలయ గోపురానికి పూజలు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఆలయం చూట్టూ కట్టిన స్టేజ్‌ లాంటి నిర్మాణం కూలిపోవడంతో చినజీయర్ స్వామి, ఇతర పూజారులు ఒక్కసారిగా పడిపోయారు. అయితే మధ్యలో పట్టు దొరకడంతో అందరూ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.