చిత్తశుద్ధితోనే అవినీతి నిర్మూలన సాధ్యం

                 చిత్తశుద్ధితోనే అవినీతి నిర్మూలన సాధ్యం

CORRUPTION
CORRUPTION

అక్రమ మార్గాల్లో వ్యవహారాలను చక్కబెట్టుకునేందుకు లంచా లు ఇయ్యచూపే వారికి ఏడేళ్ల జైలు విధించే నూతన అవినీతి నిరో ధక చట్టం-2018 రానున్న రోజుల్లో పరిపాలన చాలా ప్రభావాన్ని చూపిం చవచ్చు. అవినీతి నిరోధిస్తామని, నల్లధనాన్ని వెలికి తీస్తామనే నినా దంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం ఏ ఉద్దేశ్యంతో తెచ్చారో? ఎంత మేర కు అవినీతిని నిరోధిస్తుందో భవిష్యత్‌ రోజుల్లో చూడాలి. ప్రజాస్వా మ్య దేశాలలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ విధాన రూపకల్పన అమలులో కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రధానంగా అభివృద్ధి చెందు తున్న దేశాలలో ప్రజలలో అధికశాతం నిరక్షరాస్యులుగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉండటం వలన వీరు ప్రభుత్వ పాలనపై చాలా ఆకాంక్షలు పెట్టుకుంటారు. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగు లు ప్రజాధనం పట్ల నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉండటమే కాక వారిలో అంకిత భావం సేవా తత్పురత శ్రద్ధ కనబడటం లేదు.

కొద్దిమంది ఉద్యోగుల అనైతిక ప్రవర్తన కారణంగా నిధుల దుర్వినియోగం బంధుప్రీతి ఆశ్రిత జనపక్షపాతం ప్రభుత్వ రహస్యాలను బహిర్గత పర్చటం తమ బంధువ్ఞలకు లేదా స్నేహితులకుప్రయోజనం చేకూర్చే విధంగా తమ అధికారాలను ఉపయోగించడం మొదలైన పరిస్థితులు పాలనలో చోటు చేసుకున్న ఫలితంగా ప్రజలలో ప్రభుత్వ పాలన పట్ల విశ్వాసం సన్నగిల్లుతోంది. 1970 తరువాత ప్రభుత్వ ఉద్యోగులలో అవినీతి అనైతిక ప్రవర్తన పెరిగింది. రాజకీయ నాయకుల వ్యాపార వర్గాల కలయిక ఫలితంగా పాలనా అధికారాలు యంత్రాంగం ఉద్యోగుల ప్రవర్తన దృక్పథంపై తీవ్ర ప్రభావాన్ని చూపడానికి దారితీసింది. ప్రభుత్వ పాలనలో సంస్కరణలను తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే వివిధ సంఘాలను కమిటీలను నియమించడం జరిగింది.

గోపాలస్వామి అయ్యంగార్‌ కమిటీ (1949), గోర్యాల కమిటీ (1951) పాల్‌ అపిల్‌బీ కమిటీ (1953,1956) సంతానం కమిటీ (1964) పాలనా సంస్కరణల సంఘం (1966) ఎల్‌.కె. జాల్‌ కమిటీ (1981) మొదలైన కమిటీలు చేసిన సిఫారసులు చిత్తశుద్ధి లోపం కారణంగా అనేక ముఖ్య సూచనలను అమలు పర్చలేకపోయారు. డెబ్బయిఏళ్ల స్వాతంత్య్ర దేశంలో పరిపాలన పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఇంతవరకు ప్రయత్నాలు జరగలేదు. దేశం నేడు ఎదుర్కొంటున్న అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక సంక్షోభాలకు అనర్థాలకు ప్రభుత్వ వ్యవస్థ లోపాలే కారణం అని చెప్పకతప్పదు. ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రైవేటీకరణకు ప్రజలు ఆకర్షితులయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు కట్టే పన్నులలో నుండి జీతభత్యాలు పొందే ఉద్యోగులు ఆ ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నాలు ఏనాడూ చేయకపోవడం ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే రిటైర్‌మెంట్‌ వరకు తమరిని ఎవరూ ఏమీ చేయలేరన్న భావన రాజ్యాంగ రక్షణలు సగటు ప్రభుత్వ ఉద్యోగిలో అతివిశ్వాసాన్ని పెంచుతున్నాయి.

ప్రజలకు దాపరికం సామాన్యులకు అందుబాటులో జవాబుదారీగా ఉండాల్సిన ‘పాలన అవినీతికి రహస్య ఒప్పందాలకీ ఏకపక్ష నిర్ణయాలకీ అక్రమ సంపాదనలకు కారణం అవ్వడం కేవలం ఉద్యోగులే కాదు అధికార పార్టీల అధికార దుర్వినియోగ పద్ధతులు కూడా కారణం. పారదర్శక పాలన ఒక నినాదంగానే మారిపోయింది. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రత్యక్షంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ శాఖలు రెవెన్యూ, పోలీసు మున్సిపల్‌ పంచాయతీరాజ్‌ కమర్షియల్‌ టాక్స్‌ తదితర విభాగాల్లో అవినీతి గురించి ప్రతిరోజు కథనాలు వస్తూనే ఉంటాయి. ఒక్కొక్క పనికి ఒక్కొక్క రేటు పెట్టి మరీ వసూలు చేస్తున్నారు. అవినీతి నిరోధక శాఖలు, సిబిఐలాంటి సంస్థలు కూడా అధికార పార్టీల కనుసన్నలలో నడిచే పరిస్థితులు ఉన్నాయనేది బహిరంగ రహస్యం ఏమాత్రం రాజకీయ అండలేని చిరు ఉద్యోగులపైనా దాడులు జరుగుతున్నాయని, పెద్ద తిమింగలాలు తప్పించుకుంటున్నాయన్న విమర్శలు ఉన్నాయి. లంచాలు తీసుకొని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కొందరు అధికారులు రాజకీయ అండతో అతికొద్ది కాలంలోనే మళ్లీ పోస్లింగ్‌లోకి వస్తున్నారు.

ఏ అండా లేని ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. ఇటువంటి సందర్భంలో వచ్చిన ఈ చట్టంలో ఒక మంచి మార్పు చేశారు. కొత్త చట్టం ప్రకారం అవినీతి కేసుల దర్యాప్తు రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ చట్టానికి మరింత పదును పెట్టాలి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి నిర్మూలన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీ అకుంఠిత దీక్ష పరిపూర్ణమైన నిష్పాక్షికత అంకిత భావంతో పనిచేసినప్పుడే పేదల సంక్షేమం కోసం ప్రభుత్వాలు వెచ్చిస్తున్న లక్షలాది కోట్ల ప్రజాధనం ఉపయోగపడుతుంది. రాజకీయ చిత్తశుద్ధి సమాజంలో వివిధ వ్యవస్థలోని నైతిక విలువలు ప్రభుత్వ ఉద్యోగిలో నిస్వార్థం ఉన్నప్పుడే అవినీతి నిర్మూలన జరుగుతుంది. ప్రతి శాఖలో బాధ్యతాయుతంగా నీతిమంతంగా పనిచేసే ఉద్యోగులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.
– సురేష్‌ కాలేరు (రచయిత: రాష్ట్ర సహాధ్యక్షులు, తెలంగాణా ఉద్యోగుల సంఘం)