చికిత్సతోనే దంతసౌందర్యం

Pretty-
మనిషి మనసారా నవ్వుకోవాలంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి.  దీనితో బాటు నోరు, పళ్ళు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటే నవ్వు, ఆనందం మన స్వంతమే మరి.  దంత వైద్యంలో నేడు ఎన్నో అధునాతన ప్రక్రియలు వచ్చాయి. ముఖ్యంగా ఆత్మవిశ్వాసంతో నవ్వుకో డానికి సెరమిక్‌ లామినేషన్‌ (సిమెంట్‌ పూత) దోహదపడుతుంది. దంతవైద్య విధానంలో వచ్చిన నూతన మార్పులు, పరిశోధనల కారణం గా, దంత సౌందర్యం పరంగా పెరుగు తున్న అవసరాల దృష్ట్యా అందు బాటులోకి వచ్చిన విధానం ఈస్థటిక్‌ డెంటిస్ట్రీ. దంతసౌందర్యం పెంపొందించుకోవడం వల్ల ఆత్మస్ధైర్యం పెరుగు తుంది. ఈస్థటిక్‌ డెంటిస్ట్రీ నూతన దంత సౌందర్య వైద్య విధానంలో కొత్త నైపుణ్యాలు, సామాగ్రి అందుబాటులో ఉన్నాయి.  ఈ రంగంలో అభివృద్ధి మరింత ప్రకాశవంతమైన నవ్వులకు కారణ మవుతూ దంతవైద్యులకు మరింత ఉత్సాహాన్నిస్తోంది.  ఈస్థటిక్‌ డెంటిస్ట్రీ బాగా వృద్ధినొంది ముఖ సౌందర్యాన్ని ఎన్నోరకాలుగా చక్కదిద్దడ ానికి ఉపయోగపడుతోంది.
చిగుళ్ళ వ్యాధి, పాడైన, ఊడిన పళ్ళకు చేసే చికిత్స సౌందర్య పరమైన మెళుకువలతో మరింత బాగా, సులువుగా చేయడానికి అవకాశం ఉంది. చిగుళ్లు, వాటి చుట్టూ ఉన్న కండరాల ద్వారా ముఖంలో పొందికను తీసుకువచ్చి ఎలా కావాలంటే అలా నవ్వుకునే విధంగా చేసినప్పుడే చూడడానికి చక్కగా ఉంటుంది.
స్వాస్థం కల్గించడానికి లేదా పళ్ళు తిరిగి ముందటి రూపం రప్పించడానికి పళ్ళను రుద్దడం లేదా కొన్ని ద్రవాలు పళ్ళు పీల్చుకునేటట్లు చేస్తారు. దీని వల్ల చిగుళ్ళవాపుకి గురి కావచ్చు.  పైగా ఈ విధానం మళ్ళీ చేయించుకో వల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఏవిధమైన ప్రతికూలత, నష్టం లేకుండా సహజంగా ఉండేందుకు వాడే ప్రక్రియే సిరమిక్‌ లామినేషన్‌.  దీని వల్ల రెండు రకాల విశ్వసనీయ ఉపయోగాలున్నాయి. పైకి కనిపించే పదార్ధ గుణం సహజంగా, మెరుగ్గా ఉండటం, రెండవది అతి సహజంగా అంటే మామూలు పళ్ళ మాదిరి గట్టిగా ఉండటం కనబడటం.  అంతేకాక ఈ పళ్లు ఎక్కువగా గార పట్టకుండా ఆరోగ్యమైన చిగుళ్లతో తళతళలా డుతూ అందంగా ఉంటాయి. దంతాలు అరుగుదలలో నిరోధకత కల్గి స్వాభావికమైన బలాన్ని కల్గిన మెరుగైన దంత సౌందర్య చికిత్స ఇది. అలంకరణకు సంబంధించి విస్తృత అవకా శాలున్న ఈ చికిత్సా విధానంలో పళ్ళు సహజ రంగును కల్గిఉండటం, ముక్కలైన పళ్ళను మార్చడానికి, పళ్ళ మధ్య సందులు, రంధ్రాలు లేకుండా, వంగిన వంకర పళ్ళను సరిచేయుట ఇత్యాది ఎన్నో దంతసమస్యల నివారణకు దంత వైద్యులకి, రోగులకు కూడా తిరుగులేని పేరెన్ని కగన్న చికిత్సా విధానం సిరమిక్‌ లామినేషన్‌.  ఎక్కువకాలం సౌకర్యంగా, బలంగా ఉండే ఈ చికిత్సా విధానం దంతవైద్య విధానంలో ప్రధాన మైంది.