చికాగో ప్రాంతంలో ఉద్యోగాలిప్పిస్తానని నట్టేట ముంచేశాడు
హైదరాబాద్: అమెరికాలోని చికాగో ప్రాంతంలో ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి ఓ ఏజెంట్ 30 మంది బాధితులను నట్టేట ముంచేశాడు. ఎయిరిండియా విమానంలో చికాగోకి వెళ్లిన 30 మంది బాధితుల్ని అక్కడ ఎయిర్ పోర్ట్ అధికారులు వీసాలు, రిటర్న్ టికెట్, సరైన పత్రాలు లేవని చెప్పి తిరిగి అదే విమానంలో హైదరాబాద్కు పంపేశారు. ఏజెంట్ చేతిలో మోసపోయామని తెలిసి సదరు బాధితులు అమోమయంలో పడిపోయారు.