చికాగోలో కాల్పులు, ముగ్గురు మృతి

chicago
chicago

చికాగో(అమెరికా): అమెరికాలోని చికాగోలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడటంతో మొత్తంముగ్గురు చనిపోయారు. మెర్సీ ఆసుపత్రి పార్కింగ్‌ ప్రదేశంలో ఓ మహిళతో వాగ్వాదం జరిగిన తర్వాత ఈ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులుజరిపినట్లు పోలీసులు తెలిపారు. దుండుగుడు కూడా కాల్పుల్లో హతమయ్యాడు. అతడు తనంతట తాను కూడా కాల్చుకున్నాడా లేదంటే పోలీసు కాల్పుల్లో చనిపోయాడా అనే విషయం స్పష్టంగా తెలియజలేదు. ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న ఓ మహిళపై తొలుత దుండగుడు కాల్పులు జరిపాడు. తర్వాత మరో మహిళపై కూడా కాల్పులుజరిపాడని పోలీసులు తెలిపారు. వీరిద్దరు ఆసుపత్రి ఉద్యోగులేనని తేలింది. తొలుత బుల్లెట్లకు గురయిన మహిళ దుండగుడి మాజీ ప్రేయసిగా భావిస్తున్నారు. దుండగుడిని అడ్డుకోబోయిన పోలీస్‌ అధికారి జిమెనెజ్‌ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన ఇద్దరు మహిలలతోపాటు దుండగుడి వివరాలు మాత్రం ఇంకా వెల్లడికావాల్సి ఉంది. ఆసుపత్రి ప్రాంగణంలోజ రిగినకాల్పుల ఘటనతో సిబ్బందిరోగులు భయాందోళనలకు గురయ్యారు. భద్రతా సిబ్బంది ఆసుపత్రిలో ఉన్న ఇతరులందరినీ సురక్షితంగా బైటకు పంపించేసారు. మెర్సీ ఆసుపత్రిలో ప్రస్తుతం ఎలాంటిప్రమాదం లేదని, రోగులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈకాల్పుల్లో మరొక పోలీస్‌ అధికారికి తీవ్రగాయాలయ్యాయి. సంఘటనపై పోలీసులు సమగ్రదర్యాప్తుచేస్తున్నారు.