చింత‌మ‌నేని, ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు

Vijayasai reddy
Vijayasai reddy

విజయవాడ: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడిన కారణంగా ఆయనపై అనర్హత వేటు వేయడమేగాక 22మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావును ఆయనతోపాటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం సాయిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ… ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని గతంలోనే ఫిర్యాదు చేశామన్నారు.