చాలీచాలని ఇరుకు స్థలాల్లో పేదల నివాసాలు

Housing
Housing

చాలీచాలని ఇరుకు స్థలాల్లో పేదల నివాసాలు

ఇల్లు ఇరకాటం ఆలి మర్కటం అనే సామెతను భార తీయులు నిజం చేసి చూపుతున్నారు. భారతదేశం లోని గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేదల నివాసాలు కుటుంబ సభ్యులు నివసించడానికి అసౌకర్యంగా ఉన్నాయి. మన దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల నివాస స్థలాలు జైలు గదులకు కేటాయించిన స్థలాలకన్నా తక్కువగా ఉండటం చాలా బాధాకరం.

ప్రతి ఏటా ఎన్‌ఎస్‌ఎస్‌ఓ వారు సర్వే నిర్వహిస్తారు. అంతర్జాతీయ ఒప్పందాలు, సుప్రీంకోర్టు దిశానిర్ధేశాలు రాజ్యాంగం ద్వారా జైళ్లకు సంక్రమించిన మార్గనిర్దేశకాల నిమిత్తం జైలు గదుల నిర్మాణం ఉంటుంది. అధునాతన జైళ్ల నమూనా 2016 ప్రకారం నివాస స్థలాల పరిస్థితి జైలు గదుల స్థలాల కన్నా చిన్నవిగా, అధ్వాన స్థితిలో ఉందని 69 రౌండ్‌ సర్వే సమాచారం. భారతదేశంలో సుమారు 80 శాతం పేద కుటుంబాలకు సగటున నివసించే స్థలం 449 చదరపు అడుగుల పేదలకన్నా చిన్నగా లేదా సమానంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో అయితే 4.8 మందికి సరిపడ అంటే ఒకే మనిషికి 94 చదరపు అడుగులు అంతకన్నా తక్కువ స్థలం కేటాయించబడినది. వీరి నివాసస్థలాలు జైలు గదులకు కేటాయిం చిన 96 చదరపు అడుగుల స్థలం కన్నా తక్కువ అన్నమాట. పట్ట ణ ప్రాంతాలలో కూడా అదే పరిస్థితి. 60 శాతం పేద కుటుంబాలు సగటున 380 చదరపు అడుగులు లేదా అంతకన్నా తక్కువ స్థలా లలో నివాసం ఉంటున్నారు. అయితే ఇది 4.1 మందికి మాత్రమే సరిపోతుంది.

అంటే 93 చదరపు అడుగుల స్థలం ఇది కూడా జైలు గదుల కన్నా తక్కువగానే ఉంది. కాని కొన్ని కుటుంబాలలో కుటుంబ సభ్యుల కన్నా వారు నివసించే గృహాలు చాలా విశాలం గా, పెద్దవిగా ఉన్నాయి. ప్రస్తుతం మోడల్‌ జైళ్ల స్థలాలతో పోల్చితే గ్రామీణవాసులు 80 శాతం, పట్టణ ప్రాంత వాసులు 60 శాతం మంది నివసించే స్థలాలు ఇరుకుగా ఉన్నాయి. ఎక్కువ మంది తక్కువ స్థలాలలో నివసిస్తున్నారు.ఈ అంతరాలను రూపుమాపడం అవసరం. కొన్ని వెనుకబడిన రాష్ట్రాలలో పేదలైన దళితులు, ఆదివాసీలు చాలా తక్కువ స్థలాలలోనే జీవనం కొనసాగిస్తున్నారు. షెడ్యూల్డ్‌ కులాల వారికిసగటున 70.3చదరపు అడుగులు, షెడ్యూ ల్డ్‌ తెగల వారికి 85.7చదరపు అడుగుల స్థలం మాత్రమే కలిగి ఉ న్నారు. 20 శాతం పేదవారు గ్రామాలలో 78 చదరపు అడుగులు పట్టణాలలో 75 చదరపు అడుగుల స్థలాన్ని సగటున కలిగి ఉన్నారు. కాని 20 శాతం ధనికులైతే సగటున 102 చదరపు అడు గుల గ్రామాలలో పట్టణ ప్రాంతాలలో135చదరపు అడుగుల స్థలం కలిగిఉన్నారు. ఇటువంటి పరిస్థితిని గమనించి రాష్ట్రాల ప్రభుత్వా లు పేదలు, సామాన్యప్రజల కోసం ఇళ్ల నిర్మాణ పథకాలను చేప డుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం పేదవారికి కూడా డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లను నిర్మించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. కానీ కొన్ని చోట్ల స్థలాల సేకరణ సమస్య, మరికొన్ని చోట్ల పాలనా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయినా ప్రభుత్వం తమ లక్ష్యం సాధించితీరుతామనే దృఢంగా చెబుతోంది. జూన్‌ 2014 వరకు తెలంగాణలోని పేదలకు పాలక వర్గాలు నిర్మించిన గృహాల సంగతి ఎలా ఉన్నా ప్రస్తుత ప్రభుత్వం తల పెట్టిన డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం మాత్రం భారీ వ్యయంతో కూడుకున్నదని చెప్పవచ్చు ఇటీవలనే విడుదలైన సామాజిక, ఆర్థిక, కులాల గణాంకాలు 2011 నివేదికలో గ్రామీణ ప్రాంతాల్లోని 56.44 లక్షల కుటుంబాల్లో 36లక్షల కుటుంబాలకు సంబంధించి 4.41లక్షల కుటుంబీకులు అద్దె ఇళ్లల్లో నివసిస్తున్నారు. ఆ అద్దె ఇళ్లలో రెండుగదులు మాత్రమే ఉంటున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న గృహాలలో రెండు పడకగదులు, ఒక హాలు, వంటగది, బాత్‌రూమ్‌, టాయిలెట్‌ ఉంటాయి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 56,43,739 కుటుం బాలున్నాయి. వీటిలో స్వంతంగా ఇళ్లున్నవారు 51,96,080. 4,09,346 కుటుంబాలు అద్దె ఇళ్లలో ఉంటున్నాయి. 2004 వరకు పేదలకు నిర్మించిన ఇళ్లు 17,34,826. 2004 నుంచి 2014 వరకు నిర్మించిన ఇళ్లు 24,91,870. రాష్ట్రంలోని పక్కా ఇళ్లు, కచ్చాఇళ్లు, ఎన్ని ఉన్నా యో పరిశీలిస్తే ఆదిలాబాద్‌ జిల్లాలో 3,91,399 పక్కాఇళ్లు, 83,892 కచ్చా ఇళ్లు ఉన్నాయి. నిజామాబాద్‌లో 45,9095 పక్కాఇళ్లు, 71,500 కచ్చా ఇళ్లు, కరీంనగర్‌లో 689426 పక్కా ఇళ్లు, 61704 కచ్చా ఇళ్లు ఉన్నాయి. మెదక్‌లో 529658 పక్కా ఇళ్లు, 89798 కచ్చా ఇళ్లుఉన్నాయి. రంగారెడ్డిలో 501538 పక్కా ఇళ్లు, 822 కచ్చా ఇళ్లు ఉన్నాయి.

మహబూబ్‌ నగర్‌లో 683192 పక్కాఇళ్లు, 51772 కచ్చా ఇళ్లు ఉన్నాయి. నల్గొండలో 736,692 పక్కాఇళ్లు, 22904 కచ్చాఇళ్లు ఉన్నాయి. వరంగ్‌లో 574334 పక్కాఇళ్లు, 141134 కచ్చా ఇళ్లు ఉన్నాయి. ఖమ్మంలో 494538 పక్కాఇళ్లు, 54165 కచ్చా ఇళు ్లఉన్నాయి. రాష్ట్రంమొత్తంమీద 50,59,872పక్కాఇళ్లు, 577691 కచ్చాఇళ్లు ఉన్నాయి. వీటిలో ఒకే గదితో ఉన్న ఇళ్లు 756416 కాగా, రెండు గదులు ఉన్న ఇళ్లు 28,19,737 ఉన్నాయి. పేదలకు పక్కాఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న పథకం1983లో ప్రారం భమయింది. అప్పటి నుంచి గత ప్రభుత్వాలు వివిధ పథకాల కింద 42.27 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించారు. ఈ ఇళ్లన్నీ ‘అగ్గిపెట్టెలు మాదిరిగా ఉంటాయని చెప్పవచ్చు.

ఈ ఇళ్లల్లో ఒకేగది, వంటగదికి కొంత స్థలం మాత్రమే ఉంటాయి. ప్రస్తుత ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావి స్తోంది. ఇళ్లులేని వారికి డబుల్‌బెడ్‌ రూమ్‌లు, హాలు,కిచెన్‌ రూమ్‌లతో కలిపి చాలా గౌరవప్రదమయిన నీడగూడుగా ఇళ్లునిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అర్హులయిన వారందరికీ ఈ విధంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటే కనీసం రెండు మూడు దశాబ్దాలయినా పడుతుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఇది నిర్విరామ నిరంతర కార్యక్రమంగా అభివర్ణించారు.

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండున్నర ఏళ్లలో మంజూరయిన 2.6 లక్షల ఇళ్లలో 1500 డబు ల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు మాత్రమే నిర్మాణమ య్యాయని మరో 10వేల గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని గృహనిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు.అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథ కం కోసం 17,600కోట్ల రూపాయలు కేటాయించింది. హడ్కో నుంచి 15,900 కోట్ల రూపాయల రుణం కూడా తెచ్చింది. ఈ పథకం వేగవంతం కావడానికి కొత్త మార్గదర్శకాలు త్వరలో విడు దల కానున్నాయి.

ఇసుకపైఉన్న నిబంధనలు సరళీకరిస్తారు. అలా గే బస్తా సిమెంట్‌ రూ. 230కే సరఫరా అయ్యేలా 31 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటారని గృహనిర్మాణశాఖ మంత్రి ఇంద్రక రణరెడ్డి చెప్పారు. ఇదిలావ్ఞండగా స్టేట్‌ లెవల్‌ ఎక్స్‌పర్ట్‌ అప్రైజన్‌ కమిటీ (ఎస్‌ఇఎసి) డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకం కింద మూడు ప్రాజెక్టులకు సిగ్నల్‌ ఇచ్చింది. ఆ మూడు ప్రాజెక్టులు 629.8 కోట్ల రూపాయలతో చేపట్టి 6804 ఇళ్లను నిర్మిస్తారు. ఒక్కొక్క ఇంటికి 9.25 లక్షల చొప్పున ధర పలుకుతుంది. మేడ్చల్‌ జిల్లాలో ఒక ప్రాజెక్టు, కిసర మండలంలో మరొకటి, షామీర్‌ పేట మండలంలో ఇంకొకటి ఈ ప్రాజెక్టుల కింద ఇళ్లు నిర్మాణం అవ్ఞతాయి.

– కె.అమర్‌