చాలా సరదాగా ఉండేవాళ్లం

actress-vamika-
భలే మంచి రోజు సినిమాలో నటించిన భామ వామికా. ఆమె నటించిన తమిళ సినిమా మాలై నేరత్తు మయక్కం. తెలుగులో నన్ను వదలి నీవు పోలేవులే పేరుతో ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా  హీరోయిన్‌ వామికా గబ్బి హైదరాబాద్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడింది. ఆ విశేషాలు… మీకోసం..

నన్ను వదిలి నీవు పోలేవులే తమిళ వెర్షన్‌కు స్పందన?
చాలా మంచి స్పందన వచ్చింది. నా పెర్ఫార్మెన్స్‌కి అప్రిషియేషన్‌ బాగా వచ్చింది. నా ట్విట్టర్‌ అయితే ట్వీట్లతో నిండిపోయింది.

మీ పాత్ర గురించి చెప్పండి?
మనోజా అనే పాత్ర చేశాను. తను మోడ్రన్‌ గర్ల్‌. ప్రతి మహిళా కోరుకునేటట్టు తను కూడా ప్రేమ కావాలని కోరుకుంటుంది. తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో కలలు కంటుంది. కాస్త రియలిస్టిక్‌ పాత్ర ఇది.

ఏ జోనర్‌ చిత్రం?
రిలేషన్‌ షిప్‌ డ్రామా. రియలిస్టిక్‌గా ఉంటుంది.

ఈ సినిమాను చేయడానికి  మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలేంటి?
బోల్డ్‌గా చెప్పాలంటే మంచి స్క్రిప్ట్‌ ఇది. ముందు కథ వినగానే నేను చేయడానికి హెజిటేట్‌ చేశాను. కానీ చేశాను.

గీతాంజలితో చేయడం ఎలా అనిపించింది?
నేను చాలా ఫ్రీ గా తనతో మూవ్‌ అయ్యేదాన్ని

శ్రీ రాఘవ వర్కింగ్‌ స్టైల్‌ ఎలా ఉంటుంది?
తను నాకు టీచర్‌లాంటివాడు. కనురెప్పలు ఎక్కువగా వాల్చినా ఇంకో షాట్‌ తీస్తాడాయన. అలాగే చాలా సెటిల్డ్‌గా నటించాలి. ఐబ్రోని కాస్త పైకి లేపినా ఒప్పుకోడు. అందుకే నేను ప్రి షాటూ చేయడానికి ముందు మీరు నా పాత్ర ఈ సమయంలో ఎలా బిహేవ్‌ చేస్తుందని రాస్తే అలాగే చేస్తాను. వివరించండి అని అడిగేదాన్ని. చెప్పినదాన్ని బట్టే నటించాను.

నిర్మాత గురించి చెప్పండి?
ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటారు మా నిర్మాత కోలా భాస్కర్‌గారు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉందని తెలిసినా వెంటనే దాన్ని సాల్వ్‌ చేస్తారు. అంతేగానీ  అవాయిడ్‌ మాత్రం చేయరు. నా తెలుగు ప్రొడ్యూసర్‌ కూడా అంతే గొప్ప వ్యక్తి, సో  సౌత్‌లో ఇప్పటికీ నేను చేసింది రెండు సినిమాలే అయినా రెండు సినిమాలకూ మంచి పేరు వచ్చింది. నిర్మాతలు చాలా మంచి వారు.

హీరో గురించి ?
బాలకృష్ణ కోలా కొత్త వ్యక్తి అయినా చాలా బాగా చేశాడు. మేమంతా ఒకే ఏజ్‌ గ్రూప్‌ వాళ్ళం కావడంతో చాలా సరదాగా ఉండేవాళ్ళం. ప్రభు అనే పాత్రలో తాను జీవించాడనే చెప్పాలి.

ఇంకే సినిమాలైనా చేస్తున్నారా?
మలయాళంలో ఓ సినిమా చేస్తున్నా. రెజ్లర్‌గా చేస్తున్నా. రెజ్లింగ్‌ ట్రైనింగ్‌ తీసుకోబోతున్నా. స్పోర్ట్స్‌ కామెడీ చిత్రమిది.