చార్మి, ముమైత్ ఎక్కడుంటే అక్కడ విచారణ

చార్మి, ముమైత్ ఎక్కడుంటే అక్కడ విచారణ
హైదరాబాద్:డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సిట్ కార్యాలయంలోనే విచారిస్తామని డ్రగ్స్ కంట్రోలర్, ఆఫీసర్ డిఐజి అకున్ సబర్వాల్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే పదిమందికి నోటీసులిచ్చి సంతకాలు తీసుకున్నామని తెలిపారు. మరికొంతమంది అందుబాటులో లేకపోవటంతో నోటీసులివ్వలేకపోయామన్నారు.. హీరోయిన్ చార్మి, డాన్సర్ ముమైత్‌ఖాన్ ఎక్కడుంటే అక్కడే వారిని ప్రశ్నిస్తామని పేర్కొన్నారు.. ఇంక ఆచాలా మంది సినీ ప్రముఖులు లిస్టులో ఉన్నారని, నోటీసులందుకున్నవారిని సిట్ కార్యాలయంలో విచారిస్తామని , హీరోయిన్లు మాత్రం సిట్ కార్యాలయంలో కాకుండా బయట విచారిస్తామని తెలిపారు. విచారణ అంశౄలను ఎక్కడా బయటకు వెల్లడించమని పేర్కొన్నారు.