చాకో మధురాలు

                           చాకో మధురాలు

FRUIT AMBROSIA
FRUIT AMBROSIA

ప్రేమ తియ్యగా ఉంటుందో లేదో చెప్పలేం గానీ…కోవా మాత్రం ప్రేమ మాధుర్యాన్ని కలిగిస్తుందన్నది మాత్రం నిజం. అందుకే మధురాతి మధురమైన చాక్లెట్‌ రుచులు మీకోసం…
ఫ్రూట్‌ అంబ్రోసియా
కావలసినవి : కొవ్ఞ్వలేని పెరుగు-అరలీటరు కొవ్ఞ్వ లేని చల్లని విప్‌డ్‌ క్రీమ్‌-పావ్ఞలీటరు షుగర్‌ఫ్రీఇన్‌స్టెంట్‌వైట్‌ చాకొలెట్‌ఫుడ్డింగ్‌ మిక్స్‌: 30గ్రా. కమలాతొనలు-రెండు కప్పులు పైనాపిల్‌ ముక్కలు-రెండు కప్పులు పైనాపిల్‌ జ్యూస్‌-రెండు టేబుల్‌స్పూన్లు
తయారుచేసేవిధానం : పెరుగు, విప్‌డ్‌ క్రీమ్‌, చాకొలెట్‌ ఫుడ్డింగ్‌ మిక్స్‌, పైనాపిల్‌ జ్యూస్‌ వేసి బాగా కలపాలి. మిశ్రమం బాగా మృదువ్ఞగా అయ్యాక కమలాతొనలు, పైనాపిల్‌ ముక్కలు వేసి అందించాలి. ఇష్టాన్ని బట్టి ద్రాక్ష, పుచ్చ, యాపిల్‌…ఇలా ఇతర పండ్ల ముక్కలను కూడా కలుపుకోవచ్చు.

చాకొలెట్‌ పాప్‌కార్న్‌

CHOCKLATE POPCORN
CHOCKLATE POPCORN

కావలసినవి : మొక్కజొన్న గింజలు – కప్పు, డార్క్‌ చాకొలెట్‌ – 50గ్రా ఉప్పు – చిటికెడు, నెయ్యి – టేబుల్‌స్పూన్‌, నూనె-రెండు టేబుల్‌స్పూన్‌
తయారుచేసే విధానం : పాన్‌లో నీళ్లుపోసి చాకొలెట్‌ తురుము ఉన్న గిన్నె ఉంచి కరిగించాలి. కరగగానే తీసి నెయ్యివేసి ఉండలు కట్ట కుండా కలపాలి. మందపాటి బాణలిలో నూనెవేసి కాగాక ఉప్పు వేసి కలిపి పాప్‌కార్న్‌ గింజలు వేసి మూతపెట్టాలి. కార్న్‌ పాప్‌ అయ్యాక తీసి మరోగిన్నెలో వేసి వాటిమీద కరిగించిన చాకొ లెట్‌ వేసి మూతపెట్టి పైకీ కిందకీ షేక్‌ చేయాలి.