చవితి సందర్భంగా కలెక్టర్‌ ఆమ్రపాలి విగ్రహం

Statue
Statue

చవితి సందర్భంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి విగ్రహం

వరంగల్‌: వినాయక చవితి సందర్భంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలికి ఓ అరుదైన గౌరవం దక్కింది. అంతలోనే అది కాస్తా వివాదాస్పదమైంది. వినాయక చవితి సందర్భంగా నగరంలోని ఓ గణేశ్‌ మండలి నిర్వాహకులు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం కలెక్టర్‌ ఆమ్రపాలిది. ఆమెపై ఉన్న అభిమానంతో వారు ఆమెను ఓ దేవతగా చిత్రిస్తూ విగ్రహాన్ని తయారుచేయించారు. ఆమె చేతిలో వినాయకుడు ఉండేలా డిజైన్‌ చేయించారు. కొత్తగా చూపెట్టాలనుకున్నారు. . కానీ, అది కాస్తా వివాదాస్పదమవ్వడంతో విగ్రహానికి నల్లరంగు పూశారు.