చల్లదనానికి!

రుచి

(ప్రతి బుధవారం)

cool
cool

చల్లదనానికి!

కస్టర్డ్‌తో…

కావలసినవి:
ఫలూదా సేవ్‌-రెండు చెంచాలు, సబ్జాగింజలు-చెంచా పాలు-రెండు కప్పులు, రూ అఫ్జా-చెంచా వెనిల్లా ఐస్‌క్రీం-ఒక స్కూప్‌ కస్టర్డ్‌ పొడి-చెంచా, పల్చగా తరగిన డ్రైఫ్రూట్స్‌ పలుకులు-రెండు చెంచాలు చక్కెర -రెండు చెంచాలు

తయారుచేసే విధానం
రెండు చెంచాలు తప్ప మిగిలిన పాలను ఓ గిన్నెలో తీసుకుని మరిగించాలి. ఇంతలో మిగిలిన పాలల్లో కస్టర్డ్‌ పొడివేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరిగిన పాలల్లో సేవ్‌, చక్కెరా వేసి కలపాలి. తరువాత కస్టర్డ్‌ మిశ్రమం కూడా వేసి రెండు నిమిషాల తరువాత పొయ్యి కట్టేయాలి. ఇది చల్లారాక ముందు రూఅఫ్జాని గ్లాసులో వేసి, పాల కస్టర్డ్‌ని వేయాలి. దానిపైన సబ్జాగింజలు వేసుకోవాలి. చివరగా ఐస్‌క్రీం, డ్రైఫ్రూట్స్‌ వేసుకుంటే చాలు. కస్టర్డ్‌ ఫలూదా సిద్ధం.

సోయా పాలతో…

కావలసినవి
సోయా పాలు-పావుకప్పు, మామిడిపండు గుజ్జు-కప్పు పాలపొడి-నాలుగు చెంచాలు, మొక్కజొన్న పిండి-రెండున్నర చెంచాలు వెన్నలేని పాల క్రీం-రెండు చెంచాలు, చక్కెరపొడి-నాలుగు చెంచాలు నానబెట్టిన సబ్జాగింజలు-రెండు చెంచాలు

తయారుచేసే విధానం
ఓ గిన్నెలో పాలపొడి, మొక్క జొన్నపిండీ, రెండు చెంచాల సోయాపాలూ తీసుకుని పిండిలా కలిపి పెట్టుకోవాలి. మిగిలిన పాలను మరో గిన్నెలో తీసుకుని మరిగించుకోవాలి. అందులో పాలపొడి మిశ్రమం వేసి బాగా కలిపి ఐదు నిమిషాల తరువాత దింపేయాలి. ఇది చల్లారాక మామిడిపండు గుజ్జూ, క్రీం, చక్కెరపొడీ వేసి బాగా కలపాలి. ఓ అల్యూమినియం గిన్నెలో ఈ మిశ్రమాన్ని తీసుకుని డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచాలి. రెండు గంటల తరువాత బయటకు తీసి మరోసారి మిక్సీ పట్టాలి. చిక్కగా అయిన ఈ మిశ్రమాన్ని గ్లాసులో తీసుకుని పైన సబ్జాగింజలు వేసుకుని తీసుకుంటే సరిపోతుంది. కావాలనుకుంటే..పైన మరికొంచెం మామిడి గుజ్జూ డ్రైఫ్రూట్స్‌ పలుకుల్లాంటివి వేసుకోవచ్చు.

రూఅఫ్జాతో…

కావలసినవి:
పాలు-రెండు కప్పులు, నానబెట్టిన సబ్జా గింజలు-చెంచా సగం ఉడికించిన ఫలూదా సేవ్‌-రెండు చెంచాలు రూ అఫ్జా-రెండు చెంచాలు, చక్కెర-రెండు చెంచాలు వెనిల్లా-రెండు స్కూప్స్‌, యాలకులపొడి-చిటికెడు పిస్తా, బాదం పలుకులు-రెండు చెంచాలు
తయారుచేసే విధానం
కాచి చలార్చిన పాలల్లో చక్కెరా, యాలకులపొడీ, సబ్జాగింజలూ వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. రెండు గంటల తరువాత గ్లాసులో ఈ పాలను రెండు అంగుళాలు వచ్చేవరకూ పోయాలి. తరువాత ఐస్‌ముక్కలు వేయాలి. పైన ఉడికించిన సేవ్‌, రూఅఫ్జా వేసుకోవాలి. దీనిపైన మిగిలిన పాలు పోసుకో వాలి. చివరగా ఐస్‌క్రీ,ం పిస్తా, బాదం పలుకులు అలంకరించుకోవాలి.