చలికాలంలో మేని సంరక్షణ

FAIR-1
FAIR-1

చలికాలంలో మేని సంరక్షణకు ఎంత ఎండనైనా ఓర్చుకోగలం మనం. కానీ ఎముకలు కొరికేసే చలిని తట్టుకోవడం కష్టమే. ఇంతటి చలికాలంలో ముందు బాగా ఇబ్బంది పడేది చర్మమే. ఈ చలికాలంలో వచ్చే ఇబ్బందుల నుండి బైటపడవేసేందుకు ప్రకృతి సహజమైన ఆహారాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మన శరీరం చలికి తట్టుకోగల శక్తిని పొందుతుంది. మరి ఇలాంటి సందర్భాల్లో తీసుకోవలసిన ఆహారపదార్థాలేమిటో తెలుసుకుందాం! ్య

బాదంపప్పులో ఆల్ఫాలినోలిక్‌ యాసిడ్‌ అధికంగా ఉంటుంది. ఇది చర్మకణాలకు మంచి మేలు చేస్తుంది. కొత్తకణాల ఉత్పత్తిని పెంచి, ఉత్తేజంగా ఉంచుతుంది. చర్మం పాలిపోయినట్లు ఏమాత్రం కనిపించనీయదు. ్య క్యారెట్‌లో విటమిన్‌-ఎ, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్‌, సల్ఫర్‌, సోడియమ్‌, బీటాకెరొటిన్‌ వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి రక్తాన్ని శుద్ధిచేస్తాయి. మెరుగైన రక్తప్రసరణ, చర్మానికి కొత్తమెరుపును ఇవ్వడమేగాక ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ్య ఉసిరిలో ఉండే ‘సి విటమిన్‌ కణజాలంలోని కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ కొల్లాజెన్‌ పోగులు చర్మాన్ని బాగా సాగేలా చేస్తాయి. దీని ఫలితంగా చర్మంలో ముడతలు కనిపించవ్ఞ. చర్మం పాలిపోయినట్టుగానూ మారనివ్వదు. ్య ఖర్జూరంలో లినోలిక్‌ యాసిడ్‌ అధికం. ఇది చర్మానికి తేమను బాగా అందించగలదు. ఖర్జూరం ఎక్కువగా తినడం వలన చర్మపు కాంతివంతమైన మెరుపు, నిగారింపు పెరుగుతుంది. ్య విటమిన్‌-సి, ఐరన్‌, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్‌లు అధికంగా కలిగి ఉండేవి కమలాపండ్లు. వీటిలోని విటమిన్‌-సి, చలికాలంలో చర్మం పాలిపోయి, తెల్లగా పొడిబారిపోకుండా రక్షణనిస్తుంది. రక్తంలో ఉన్న మలినాలను కూడా బైటకు పంపించి, వ్యాధి నిరోధకశక్తిని పెంచడంలో కమలాపండ్లు బాగా ఉపయోగపడతాయి.