చర్మo కాంతులీనేలా

CUTE
CUTE

చర్మo కాంతులీనేలా

మహిళల సమస్యల్లో జిడ్డుచర్మం ప్రధానమైనది. చర్మం సహజంగానే చాలా మృదువుగా ఉండేవారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్దీ తైల గ్రంథుల పనితీరు కూడా పెరుగుతుంది. ఇది చాలామందికి అనుభవమే. అయితే ఈ సమస్య మీద సరైన అవగాహనతో జాగ్రత్తలు తీసుకుంటే దీనిని అధిగమించవచ్చు. అలాంటి అవగాహననిచ్చే వివరాలు- జిడ్డుచర్మం తయారుకావడానికి అనేక కారణాలు దోహదం చేస్తాయి. మీ తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటపుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హార్మోన్లు జిడ్డుచర్మాన్ని కలిగించే కారణాల్లో ప్రధానపాత్రని పోషిస్తాయి. యుక్త వయసులో చాలామందికి నుదురు, బుగ్గలు, ముక్కు వంటివి స్నిగ్ధంగా మెరిసేది ఇందుకే.

కాగా చాలామంది మహిళల్లో గర్భధారణ సమయాల్లో కాని, నెలసరి ముందుగాని లేదా రజోనివృత్తి సమయంలో గాని హఠాత్తుగా ముఖం నూనె కారుతున్నట్టు తయారయ్యేది కూడా ఈ హార్మోన్ల తేడా వల్లనే. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగటం, ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యలు, చెమటలు ఎక్కువ పట్టటం, కృత్రిమ సౌందర్య ఉత్పత్తులు మొదలైనవి జిడ్డు చర్మానికి కారణం అవుతాయి. ్య మంచినీళ్లు బాగా తాగాలి. అవసరాన్ని బట్టి రోజుకు నాలుగు నుంచి ఆరు లీటర్ల మంచినీళ్లు తాగాలి. ్య ఆహారంలో నీరు ప్రధానంగా ఉండే కూరగాయలు బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, కాకరకాయ వంటి నీరు ప్రధానంగా కలిగిన శాకాలను, ఆకుకూరలను తీసుకోవాలి. ్య ముఖంమీద మాయిశ్చరైజర్లు, మందపాటి మేకప్‌లు, ఆయిల్‌ బేస్‌తో తయారైన సౌందర్య ఉత్పత్తుల్ని వాడవద్దు.

ఇది స్వేదరంధ్రాలను అడ్డుకుని సమస్యను మరింత ఉధృతం చేస్తాయి. అయితే మరీ అవసరం అనుకుంటే చిన్న పిల్లలకు వాడే బేబీ పౌడర్‌ను వాడవచ్చు. ్య చర్మం జిడ్డుగా తయారవుతున్నపుడు సరైనరీతిలో శుభ్రపరచుకోవటం అన్నింటికంటే ముఖ్యం. రోజుకు మూడుసార్లు గోరువెచ్చనినీటితో శుభ్రం చేసుకోవాలి. అవసరమైతే మూలికల చూర్ణాన్ని వాడితే మంచిది. ఇవి చర్మంమీద మృతకణాలను సురక్షితంగా తొలగిస్తాయి. మురికి విషతత్వాలు, కాలుష్యం వల్ల పేరుకుపోయిన వ్యర్థాలు వంటి వాటిని కూడా ఈ చూర్ణాలు తొలగించి ముఖచర్మాన్ని కాంతివంతంగా కనిపించేలా చేస్తాయి. ఉదాహరణకు పసుపుకు నిమ్మరసం చేర్చి చర్మం మీద ప్రయోగిస్తే జిడ్డుతనం వంటివి తొలగిపోతాయి.

అలాగే లొద్దుగ, తులసి, జాజికాయ, వేపబెరడు, తెల్లమద్ది, త్రిఫలాలు, తుంగముస్తలు, కస్తూరి పసుపు వంటి వాటిని నేరుగా గాని లేదా ఆవనూనెలో కలిపిగాని వాడవచ్చు. ్య మధ్యమధ్యలో నూనెను పీల్చుకునే తత్వంగల టిష్యూపేపర్‌ని, స్పిరిట్‌తో తడిపిన పేపర్‌ నాప్‌ కిన్స్‌ని కూడా వాడవచ్చు. చర్మంమీద పేరుకు పోయిన అదనపు నూనెను తొలగించడానికి యాపిల్‌ సిడర్‌ వెనిగార్‌ బాగా ఉపయోగపడుతుంది. ్య వారానికి ఒకసారి టమాటా లేదా బొప్పాయి గుజ్జుతో ముఖానికి మాస్క్‌ పెట్టుకోవాలి. లేదా కీరదోసకాయలోని రసాన్ని తీసి కలబందగుజ్జును కలిపి వాడవచ్చు. మెంతిపొడిని ఎర్ర కందిపప్పుపొడిని గోరువెచ్చని నీటిలో కలిపి పేస్ట్‌లా చేసి మొహానికి అప్లయి చేయవచ్చు. జిడ్డు మరీ తీవ్రంగా ఉంటే ముల్తానీ మట్టి బాగా పని చేస్తుంది. ముల్తానీ మట్టిని నీళ్లలో కలిపి మొహానికి రాసుకుని 20 నిముషాలు ఆగి చన్నీళ్లతో కడిగేయాలి. తరువాత తడి ఆరిపోయేలా మెత్తని టవల్‌తో అద్దుకోవాలి. మట్టి ఎంత ముదురురంగులో ఉంటే నూనెను అంత ఎక్కువగా పీల్చుకోగలుగుతుంది.

ఒక చెంచా బార్లీగింజలపొడి, నిమ్మపండ్ల తోలు చూర్ణం ఒకచెంచా, స్కిమ్‌ మిల్క్‌తో తయారైన పాలపొడి అరచెంచా, కమలా తొక్కల పొడి అరచెంచా, వీటన్నింటినీ కలిపి ఒక గాజుసీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని పావుచెంచా మోతాదులో అరచేతుల్లోకి తీసుకుని గోరువెచ్చని నీళ్లు కలిపి ముఖంమీద మెడమీద ప్రయోగించి నిముషంపాటు మసాజ్‌ చేయాలి. తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుని కాటన్‌ టవల్‌తో తడిఆరిపోయేలా అద్దాలి. మరో ఫేస్‌ప్యాక్‌-ఉడికించిన ఓట్‌మీల్‌ అరకప్పు, కోడిగుడ్డు తెల్లసొన, నిమ్మరసం-పెద్దచెంచాడు, యాపిల్‌ గుజ్జు అరకప్పు వీటన్నింటినీ పేస్టులా కలుపుకుని ముఖానికి రాసుకుని అరగంట ఉంచి కడిగేయాలి.

====