చర్మ సౌందర్యం కోసం..

                         చర్మ సౌందర్యం కోసం..

CUTE
CUTE

ఆధునిక కాలంలో చర్మ సంరక్షణకు పలు లోషన్స్‌, క్రీములు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటికంటే మనమే కొద్దిగా ఒపికతో చేసుకుంటే మీ చర్మం ఎలాంటి రుగ్మతలకు గురికాకుండా, అందంగా కనిపిస్తుంది. నేటి పొల్యూషన్‌ నిండిన వాతావరణంలో స్కిన్‌ ఎలర్జీలు సాధారణం అయ్యాయి. వేపాకును నీళ్లలో వేసి కాగబెట్టండి. ఆ నీటితో స్నానం చేయడం వల్ల శరీరానికి క్రిముల నుండి రక్షణ కలుగుతుంది. ఎలర్జీలు తగ్గుతాయి. ముఖం మీద మొటిమలు కూడా తగ్గుతాయి. ఆకుపచ్చవర్ణంలో ఉండే ఈ నీటితో స్నానం చేయడం వల్ల పెదవ్ఞలకు నీరు తగిలి చిరుచేదుగా ఉన్నప్పటికీ ఔషధవిలువలు కలిగి ఉండడం వల్ల శరీరం ఫ్రెష్‌గా ఉంటుంది.

వేపాకు అలోవెరా (కలబంద) కలిపి మిక్సీలో వేసి పేస్టులా తయారు చేయండి. అలొవెరా అందు బాటులో లేనివారు వేపాకు నిమ్మరసం కలిపిన మిశ్రమం ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమం శరీర మంతా పట్టించి మృదువ్ఞగా రుద్ది స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల శరీరం సహజ సిద్ధంగా శుభ్రపడి దుర్గంధం దరిజేరకుండా హాయిగా ఉంటుంది. మొటిమలను మాయం చేయడానికి…: ఇంకా ఈ పేస్ట్‌ను మొటిమల మీద, గాయాల వల్ల ఏర్పడిన పుండ్లు మచ్చల మీద దట్టంగా పట్టించి గంటసేపు తర్వాత కడిగేయాలి. ఈ విధంగా కనీసం ఇరవై రోజుల పాటు చేయటం వల్ల పుండ్లు మానిపోయి మచ్చలు కనుమరుగవ్ఞ తాయి. మొటిమల వల్ల ముఖంమీద ఏర్పడిన నల్లమచ్చలు తొలగిపోవడానికి ఇది సులువైన, చౌకైన విధానం అని చెప్ప వచ్చు.

దురద స్వభావం గల శరీరతత్వం (అంటే స్కిన్‌ అలెర్జీలు) ఉన్నవారు ఈ విధానాన్ని ఆచరించడం వల్ల దురద బాధ నుండి ఉపశమనం కలుగుతుంది. కొందరికి మెడవద్ద, మోచేతుల భాగంలోను చర్మం నలుపు వర్ణంలో ఉంటుంది. ఈ విధమైన సమస్యతో బాధపడుతున్న వారు మెడ, మోచేతుల వద్ద ఈ మిశ్రమాన్ని ఉపయోగించాలి. మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల క్రమేపీ మెడ, మోచేతుల వర్ణం మెరుగవ్ఞతుంది.అలాగే ఎండు వేపాకును పొడిచేసి సున్నిపిండిలో కలిపి రోజూ స్నానానికి ఉపయోగిం చడం వల్ల చర్మం చక్కగా పరిశ్రుభపడి ఆరోగ్యవంతంగా ఉంటుంది.