చర్మ సంరక్షణ, వ్యాధులకు హార్మోనీ ఎక్స్ఎల్ ప్రో చికిత్స
హైదరాబాద్ : ఎనిమిది రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా హార్మనీ ఎక్స్ఎల్ ప్రో చికిత్స అందుబాటులోకి వచ్చింది. అన్ని రకాల చర్మానికి సరిపడే విధంగా మలచి శక్తివంతమైన ప్రభావాన్ని చూపేలా దీనిని తీర్చిదిద్దారు. కాస్మొటిక్ డర్మటాలజీ, ట్రైకాలజీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రంగంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన కాస్మోడర్మా క్లినిక్స్ హార్మోనీ ఎక్స్ఎల్ ప్రో చికిత్సను దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో కాస్మొడెర్మా ఫౌండర్, సెలబ్రిటీ కాస్మొటిక డెర్మటాలజిస్ట్ డా.చైత్రా వి. ఆనంద్ మాట్లాడుతూ టీనేజీ నుంచి పెద్దల దాకా వయోపరిమితి లేకుండా ప్రతీ ఒక్కరూ ఈ చికిత్సను పొందవచ్చన్నారు. హార్మోనీప్రో ఎక్స్ఎల్ విధానంలో 3డి ఫలితాలను సైతం పొందవచ్చన్నారు. భారత్, సార్క్ దేశాల మేనేజింగ్ డైరెక్టర్ సోమెన్ దత్తా మాట్లాడుతూ హార్మోనీప్రో ఎక్స్ఎల్ సాంకేతికంగా నిరూపితమైందన్నారు. 1 నుంచి 6 చర్మ రకాలతో పాటు ట్యాన్ అయిన చర్మానికి ఈ విధానం ప్రభావం చూపిస్తుందన్నారు. అల్మా లేజర్స్ గ్లోబల్ డైరెక్టర్-బిజినెస్ డెవలప్మెంట్ ఇయల్ బల్బిందర్ మాట్లాడుతూ భారత విపణిలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయనీ, 2014లో సౌందర్యోత్పత్తుల రెవెన్యూ 35 శాతం పెరిగిందనీ, భవిష్యత్తులో ఇది 17 శాతం వరకూ పెరిగే అవకాశం ఉందన్నారు. ఎన్నో రకాలుగా ఈ చికిత్సా విధానాన్ని పరిక్షించి చూశామనీ, ఉత్తమ ఫలితాలు లభించిన తరువాతనే మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు చెప్పారు.