చర్చలకు వస్తే ఆయన రక్షణ బాధ్యత నాదే !

Kaluva Srinivasulu
Kaluva Srinivasulu

అనంతపురం: వైసీపీ నాయకుడు కాపు రామచంద్రారెడ్డి అవినీతితో పాటు నియోజకవర్గ అభివృద్ధిపై గోపులాపురంలో నిర్వహించే చర్చలకు వస్తే ఆయన రక్షణ బాధ్యత నేనే వహిస్తానని మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. ఆయన తన నివాసంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఈ చర్చలకు పార్టీలకు సంబంధం లేదన్నారు. కేవలం కాలవ శ్రీనివాసు, కాపు రామచంద్రారెడ్డిల మధ్య మాత్రమే చర్చ జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇరువైపుల నుండి పరిమితి సభ్యులు ఉంటే చర్చలు ఫలప్రదంగా సాగి నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఉదయం 11.15 గంటల నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు చర్చలను నిర్వహిస్తామని పిలుపునిచ్చారు.