చర్చకు అడ్డుతగిలే వారిని సస్పెండ్‌ చేయాలి: ఉండవల్లి

UNDAVALLI
UNDAVALLI

అమరావతి: అవిశ్వాసంపై చర్చ జరగకుండా ఆందోళన చేస్తున్న అన్నాడిఎంకే ఎంపీలను సస్పెండ్‌ చేయాలని రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అవిశ్వాసంపై చర్చ జరిగేలా స్పీకర్‌ చొరవ తీసుకోవాలని అన్నారు. గతంలో స్పీకర్‌ విచక్షణాధికారంతో మమ్మల్ని సస్పెండ్‌ చేశారని, ఆ అధికారాలతో అన్నాడిఎంకే ఎంపీలను సస్పెండ్‌ చేయవచ్చన్నారు. అలాగే రాష్ట్ర విభజన జరిగిన తీరును అప్పట్లో నరేంద్ర మోది కూడా తప్పుబట్టారని ఉండవల్లి అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే నిధులు ఇవ్వాలని కేవీపి కోర్టుకు వెళ్లాలని , రాష్ట్ర ప్రభుత్వం కూడా అఫిడవిట్‌ వేయాలన్నారు.