చరిస్తేనే ఫలితాలు..

COUGH11
COUG

చరిస్తేనే ఫలితాలు..

ఒళ్లంతా జ్వరంతో మండిపోతుంటుంది. తలంతా ఒకటే నొప్పి, కడుపులో ఏదో బాధ, విరేచనాలు, విలవిలలాడించే కాలి నొప్పి, చల్లగాలిలో కొద్దిగా తిరిగినా ఉక్కిరి బిక్కిరి చేసే ఆయాసం. అందేటో.. ఒక మాత్రో, మందో వేయగానే అంత నొప్పీ.. అంత బాధా.. అంత ఇబ్బందీ.. అంత ఆయాసమూ.. ఉన్నట్లుండి ఉఫ్‌ మని ఎగిరిపోతుంది. అవును.. ఇదంతా మందుల మాయే! ఎన్నో పరిశోధనలు, ఎన్నెన్నో ప్రయోగాల అనంతరం వైద్యరంగం మనకు అందించిన మంత్రదండాల మహిమే! ఇన్‌ఫెక్షన్‌ జబ్బులను తగ్గించటం దగ్గర్నుంచి దీర్ఘకాల సమస్యల నియంత్రణ, వాటి దుష్ప్రభావాల నుంచి కాపాడటం వరకూ మన ఆరోగ్యం విషయంలో మందుల పాత్ర ఎనలేనిది.

మందులపై శ్రద్ధ ఆసుపత్రికి వెళ్లే ముందే మొదలవ్వాలి. డాక్టర్‌ను ఏం అడగాలి? ఏయే సందేహాలు నివృత్తి చేసుకోవాలి? మందులు ఎలా వాడాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి క్షుణ్ణంగా తెలుసుకుని ఆచరిస్తే పూర్తి ఫలితాలు దక్కుతాయి. మనదేశంలో సొంతంగా మందులు కొనుక్కొని వాడేవారు చాలా ఎక్కువ. ఇది ఏ మాత్రం తగదు. ముఖ్యంగా డాక్టర్‌ సిఫారు లేకుండా నొప్పి నివారణ మందులను వాడుకోవటమూ ఒక కారణమే. మనదేశంలో వైరల్‌ జ్వరాలు ఎక్కువ. వీటికి పారాసిటమాల్‌ వంటి మాత్రలు వేసుకోవచ్చు గానీ నొప్పి నివారణ మందులు వేసుకోకూడదు. ఏ జ్వరంలోనైనా ప్లేట్‌లెట్‌ కణాల సంఖ్య తగ్గుతుంది. నొప్పి మందులు వేసుకుంటే వీటి సామర్ధ్యమూ తగ్గుతుంది.

పొట్టలో అల్సర్లు కూడా ఏర్పడవచ్చు. రక్తస్రావానికి దారి తీయవచ్చు. మధయలో గీత ఉన్న మాత్రలను విరిచి వాడుకోవచ్చు. అయితే వైద్యులు చెప్పకుండా మాత్రలను పొడి గొట్టటం, ముక్కలు చేయటం, నీళ్లలో కలపటం, గొట్టాలను విడదీయటం వంటివి చేయవద్దు. కొన్ని మాత్రలను కడుపులోకి వెళ్లాక మందు నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తారు. వీటిని విడదీస్తే ముందంతా ఒకేసారి విడుదలయి జీర్ణం కావచ్చు. ఇది దుష్ఫ్రభావాలకు దారి తీయవచ్చు. నిజానికి విరచాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు దాదాపు అన్ని మందులూ తక్కువ మోతాదుల్లో దొరుకుతున్నాయి కూడా. గుండెల్లో మంటకు వాడే ఒమిప్రొజోల్‌ వంటి మందులు, కొన్ని మధుమేహం మందులు, ఎముకక్షీణతను తగ్గించే బిస్‌ఫాస్ఫోనేట్‌ వంటివి భోజనానికి ముందే వేసుకోవాలి. క్షయ చికిత్సలో ఇచ్చే రిఫామ్సిన్‌ అయితే పరగడుపుననే తీసుకోవాలి.

కొన్నింటిని ముఖ్యంగా ఎన్‌ఎస్‌ఏఐడీ రకం నొప్పి మందులను భోజనం తర్వాతే వాడుకోవాలి. వీటిని పరగడుపున వేసుకుంటే జీర్ణాశయంలో పుండ్లు పడవచ్చు. విటమిన్‌ మాత్రలు, స్టిరాయిడ్స్‌వంటివి భోజనం తర్వాతే వాడుకోవాలి. కొన్ని సార్లు రెండు, మూడు మందులను వేసుకోవాల్సి వస్తుంటుంది. ఇలాంటి సమయంలో అన్నీ ఒకేసారి వేసుకోవచ్చా? అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తుంటుంది.

నిజానికి చాలా రకాల మందులను కలిపి వేసుకున్నా పెద్ద ఇబ్బందేమీ ఉండదు. కానీ కొన్ని మందులను మాత్రం కలపకూడదు. ఇది ఆయా మందులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు అలర్జీలకు వాడే యాంటీహిస్టమిన్స్‌, నిద్రమాత్రలు కలిపి వేసుకుంటే మత్తు మరింత ఎక్కువ కావచ్చు. అందువల్ల రెండు, మూడు మందులను వేసుకోవాల్సి వచ్చినపుడు కలిపి వేసుకోవచ్చా అని డాక్టర్‌ను స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రతి మందుకూ కొంత నిర్దిష్టమైన గడువు ఉంటుంది. వాటిని ఆ తేదీ లోపే వాడుకోవాలి.

అయితే కొన్నిసార్లు పొరపాటున గడువ్ఞ తీరిన మందులనూ వేసుకుంటుంటారు. దీనికి పెద్దగా గాబరా పడాల్సిన పనిలేదు. గడువ్ఞ తీరిన మందులు అంత సమర్ధంగా పనిచేయకపోవచ్చు. కానీ ఇతరత్రా నష్టమేమీ ఉండదు.
‘గౌరవంగా చావనివ్వండి
గౌరవంగా చావనివ్వండి ఇలా అన్నది ఎవరో తెలుసా! నోబుల్‌ బహుమతి గ్రహీత ఐన్‌స్టీన్‌. ఆయన తన చివరి రోజుల్లో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వైద్యులు సర్జరీ చేయాలనుకున్నారు. అప్పుడు ఐన్‌స్టీన్‌ ‘నను ఎప్పుడు పోవాలనుకుంటే అప్పుడు వెళ్లిపోవాలి. కృత్రిమంగా జీవితాన్ని పొడిగించటంలో ఆనందం ఉండదు. నా జీవితంలో జీవించగలిగింత కాలం జీవించాను. ఇప్పుడు పోయే సమయం వచ్చింది. నన్నాపకండి. నన్ను గౌరవంగా చావనివ్వండి అన్నారట.