చట్టవ్యతిరేకశక్తులప్రమేయంతో తూత్తుకుడి కాల్పులు

Rajanikanth
Rajanikanth

చెన్నై: తమిళనాడు స్టెరిలైట్‌ కాపర్‌ ఫ్యాక్టరీమూసివేయాలన్న ఆందోళనలో చట్టవ్యతిరేక శక్తుల ప్రమేయం వల్లనే పోలీస్‌ కాల్పులకు దారితీసిందని తమిళసూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వెల్లడించారు.పోలీసు కాల్పుల్లో చనిపోయిన మృతుల కుటుంబసభ్యులను సూపర్‌స్టార్‌ను కలుసుకునేందుకు అనుమతించలేదు. వందవరోజు ఆందోళనతో తూత్తుకుడి స్టెరిలైట్‌ కాపర్‌ప్లాంట్‌ నిలిపివేయాలన్న ఆందోళనలో ఓలీసు క ఆల్పులుజరిగి 13 మంది మృతిచెందినసంగతి తెలిసిందే. ఈ ఉద్యమంలో చట్టవ్యతిరేకశక్తుల జోక్యంఉందని రజనీకాంత్‌ బుధవారం వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత చేపట్టినవిధంగానే చట్టవ్యతిరేకశక్తులపై ఉక్కుపాదం మోపాలని రజనీకాంత్‌ విలేకరులకు వెల్లడించారు. తూత్తుకుడి సరిహద్దులోని ఒక రిసార్టులో రజనీ విలేకరులతో మాటాల్డఆరు. పోలీస్‌ కాల్పుల్లో తీవ్రగా గాయపడిన బాధితులను తూత్తుకుడి వైద్యకళాశాల ఆసుపత్రిలో ఆయన పరామర్శించారు. శాంతియుతంగాజరుగుతున్న ఈఉద్యమం కేవలం చట్టవ్యతిరేకశక్తుల రాకతోనే ఉద్రిక్తం అయిరక్తసిక్తం అఈయిందని అన్నారు. ముందు ఈశక్తులను ఎలాంటి ఉపేక్షలేకుండా కఠినంగా అణిచివేయాలని, తమిళనాడుకు ఇలాంటిశక్తులవల్ల తీవ్ర ప్రమాదం పొంచి ఉందని అన్నారు. రజనీ మండ్రం ఆధ్వర్యంలో పోలీస్‌ కాల్పుల బాధితుల కుటుంబాలకు రూ.2 రెండులక్షలచొప్పున పంపిణీచేయనున్నట్లు వెల్లడించారు. గాయపడినవారికి రూ.10వేలు అందచేస్తామన్నారు. తన అభిమానసంఘాల ప్రతినిధులు పోలీస్‌కాల్పుల్లో చనిపోయిన ఎనిమిది మంది కుటుంబాలను తీసుకువచ్చినప్పటికీ వారిని రజనీని కలిసేందుకు అనుమతించలేదు. అంతేకాకుండా రజనీకాంత్‌ మాట్లాడుతూ ప్రతి పారిశ్రామిక పెట్టుబడికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే ఇక రాష్ట్రానికి పరిశ్రమలు రావని, అందువల్లప్రజలు సహనం చూపించాలని కోరారు. అంతేకాకుండా ఈ ఉద్యమాలకారణంగా ఉపాధినష్టంజరుగుతుందని సాగునీటికొరతవల్ల ఇప్పటికే వ్యవసాయరంగం కుదేలయిందని ఉపాధికి మరింత కష్టం అవుతుందని రజనీకాంత్‌ వెల్లడించారు. పారిశ్రామిక పెట్టుబడులపై ఆందోళనలు నిర్వహించేముందుప్రజలు కొంత సంయమనంతో ఆలోచించాలనికోరారు. అన్ని నిబంధనలు భర్తీ అయినతర్వాతనే ప్రభుత్వాలు అనుమతులు ఇస్తాయని, ఇలాంటిపెట్టుబడులపై అసంతృప్తి వ్యక్తంచేసిన సంస్థలు,వ్యక్తులు కోర్టును ఆశ్రయించి న్యాయపరమైన పరిష్కారం పొందవచ్చని అదే పరిష్కారమని రజనీ వెల్లడించారు. డిఎంకె ఈ కాల్పులపై తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టింది. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలనినిర్ణయించింది. డిఎంకె ఈ స్టెరిలైట్‌ ఆందోళనను రాజకీయం చేస్తోందని ప్రజలు గమనిస్తున్నారని, సరైన గుణపాఠం చెపుతారన్నారు.ఈ సమస్యకు ముఖ్యమంత్రి రాజీనామా పరిష్కారం కానేకాదని అన్నారు. తమిళనాడుప్రభుత్వం తూత్తుకుడిపోలీసు కాల్పులపైనియమించిన కమిషన్‌పై స్పందించిన రజనీకాంత్‌ ఈచర్యలపై తనకు సంతృప్తిలేదన్నారు.