చక్కెర కంటే బెల్లం మేలు..

ఆహారం-ఆరోగ్యం

Jaggery is better than sugar .
Jaggery is better than sugar .

ఈ రోజుల్లో మనమంతా తీపి కోసం చక్కరనే వాడుతున్నాం. ఎప్పుడో స్వీట్లతో తప్పితే దాదాపుగా బెల్లం వాడటమే మానేశాం. నిజానికి పంచదార కంటే బెల్లమే మన ఆరోగ్యానికి మంచిది. అందుకు చాలా కారణాలున్నాయి

బెల్లంలో తక్కువ కేలరీలు ఉంటాయి. దీని వల్ల మన శరీరంలోకి అధికంగా కేలరీలు చేరుతాయన్న బెంగ, అధిక బరువు పెరుగుతామన్న భయం ఉండవు.

కొన్ని అనారోగ్య సమస్యల్ని తగ్గించడంలో బెల్లం అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధల్లో తేలింది.

రాత్రి పూట భోజనం చేశాక ఒక చిన్న బెల్లం ముక్క తింటే మనకు చాలా లాభాలు కలుగుతాయి. జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది.

బెల్లంలో ఉండే ఔషధ గుణాలు జీర్ణాశయంలోని డైజెస్టివ్‌ ఎంజైమ్‌లను యాక్టివేట్‌ చేస్తాయి. మలబద్ధకం, గ్యాస్‌ ఎసిడిటీ సమస్యలు కూడా ఉండవు.

పొట్ట చల్లగా ఉండాలంటే బెల్లం షర్బత్‌ తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు..

బెల్లం శ్వాసకోశ సంబంధ సమస్యల్ని కూడా నయం చేస్తుంది.

ఆస్తమా రోగులు బెల్లం, నువ్వులూ కలిపి తింటే చక్కటి ఫలితం కనిపిస్తుంది.

బెల్లం మన శరీరలోని లివర్‌కు ఎంతగానో మేలు చేస్తుంది. కాలేయాన్ని శుభ్ర పరుస్తుంది.

రోజూ బెల్లం తింటే లివర్‌లో ఉండే హానికర వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోఆయి. లివర్‌ శుభ్రంగా ఉంటుంది. కాలేయ సంబంధ అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. బెల్లంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

అందువల్ల దీన్ని తింటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ సమత్యులంలో ఉంటాయి. కండరాల నిర్మాణం సరవుతుంది. శరీర మెటబాలిజం క్రమపద్ధతిలో ఉంటుంది.

ఒంట్లో అధికంగా ఉండే నీరు బయటకు వెళ్లిపోతుంది. అధిక బరువు తగ్గుతారు.

గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. బెల్లానికి ఉన్న మరో మంచి లక్షణం ఇది బ్లడ్‌ ప్యూరిఫైయర్‌లా పనిచేస్తుంది.

రక్తం పరిశుభ్రంగా ఉన్నప్పుడు చాలా రకాల వ్యాధులు శరీరానికి రావు. బెల్లంలో పొటాషియం, సోడియం ఉంటాయి.

వీటి ద్వారా బ్లడ్‌ ప్రెషర్‌ కంట్రోల్‌లో ఉంటుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్‌, జింక్‌, సెలెనియంలాంట ఖనిజాలుంటాయి.

ఇవి సూక్ష్మక్రిముల ద్వారా శరీరానికి జరిగే హానిని అరికడతాయి. ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడతాయి. బెల్లంలో అధిక సంఖ్యలో ఉండే పోకాలు పీరియడ్స్‌ సమయంలో వచ్చే నొప్పుల్ని దూరం చేస్తాయి.

పీరియడ్స్‌ తర్వాత అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందు రోజు కొద్ది మొత్తంలో బెల్లం తీసుకుంటే మంచిదే.

బెల్లం నుంచి విడుదలయ్యే ఎండోర్ఫిన్స్‌, శరీరానికి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కీళ్లనొప్పులు, మంటలతో బాధపడే వాళ్లు బెల్లం తినాలి.

అల్లంతో కలిపి తింటే ఇంకా ఎక్కువ ఉపశమనం కలుగుతుంది. రోజు పాలలో బెల్లం కలుపుకుని తాగితే ఎముకలు పుష్టిగా ఉంటాయి.

బెల్లంలో ఉండే మెగ్నీషియం పేగులకు బలాన్నిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి బెల్లం అద్భుతమైన పరిష్కారం.

కేజీల కొద్ది బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్‌లో బెల్లాన్ని చేర్చుకుంటే మంచిది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/