చక్కెరతో చక్కని మోము

Cute
Cute

చక్కెరతో చక్కని మోము

బయటికి వస్తే అందరికళ్లు నాపై ఉండాలనే తపన ఎవరికైనా ఉంటుంది. తపన అయితే ఉంటుంది కాని, ఆవిధంగా ఓపిగ్గా తమ అందాన్ని పెంచుకునేవారు తక్కువమందే ఉంటారు. ప్రతిదానికీ టైమ్‌ లేదు, తీరక లేదని, తమ మేకప్‌పై ఆసక్తిలేనివారుగా ఉంటారు. అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి పంచదార కూడా ఉపయోగపడుతుంది. చర్మానికి తగినంత తేమ అందనప్పుడు, పొడిబారిపోతుంది. ఇలాంటప్పుడు గుప్పెడు గులాబీరేకల్ని మెత్తగా చేసుకుని దానికి టేబుల్‌స్పూన్ల పంచదార, చెంచా ఆలివ్‌నూనె కలుపుకొని ముఖం, మెడ చేతులకు రాసుకోవాలి. పావ్ఞగంటయ్యాక, చన్నీళ్లతో కడిగేసుకుంటే సరి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం నునుపు తేలుతుంది. ల పంచదారలో చెంచా తేనె, కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం కలిపి బాగా గిలకొట్టాలి. ఆ మిశ్రమాన్ని చర్మానికి పూతలా వేసుకోవాలి. ఆరాక కడిగేసుకొంటే ముఖంపై ముడతలు తగ్గుతాయి. అలాగే పంచదార, బియ్యప్పిండీ సమాన పరిమాణంలో కొంచెం తీసుకుని వాటికి చెంచా పసుపు జతచేసి పాలు కలిపి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి, నలుగులా రుద్దుకుంటే మృతకణాలు తొలగి చర్మం నిగారింపు వస్తుంది. ల పెదాలు మృదువ్ఞగా, తాజాగా కనిపించాలంటే పంచదార, తేనె, పాలూ కలిపిన మిశ్రమాన్ని రోజూ రాత్రిపూట పడుకోబోయే ముందు రాసుకోవాలి. చర్మఛాయ తక్కువగా ఉంది అనుకునేవారు కాస్త గంధం, చెంచా గులాబీనీళ్లూ, టేబుల్‌స్పూన్‌ పంచదార, పాలూ కలిపి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని తరచూ ఫేస్‌ప్యాక్‌లా వేసు కుంటే చర్మం ఛాయ మెరుగుపడుతుంది.