చంద్ర‌బాబు సియం పీఠం కోసం ఎత్తుగ‌డ‌లు

ysrcp
ysrcp

విశాఖ‌ప‌ట్ట‌ణంః వంచన వ్యతిరేక దీక్ష చేస్తున్న వైఎస్ఆర్‌సిపి నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం తాము నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ధర్మపోరాటం అంటూ తిరుపతిలో దీక్షకు దిగుతున్నారని విమర్శించారు. చంద్రబాబు దీక్షలకు పూనుకోవడం అధికారం కోసం వేస్తున్న ఎత్తుగడలే తప్ప మరొకటి కాదని వైఎస్ఆర్‌సిపి నేతలు ఎద్దేవా చేశారు.