చంద్ర‌బాబు నిజాలు మాట్లాడితే మంచిది

Vishnu Kumar Raju
Vishnu Kumar Raju

విశాఖ‌ప‌ట్ట‌ణంః ఆంధ్రప్రదేశ్ ను అల్లకల్లోలం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు డబుల్ స్టాండర్డ్స్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు. యూటర్న్ తీసుకున్న సీఎంగా చంద్రబాబునాయుడు పేరు సంపాదించుకున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబునాయుడు వాస్తవాలు మాట్లాడితే మంచిదని ఆయన సూచించారు.