చంద్ర‌బాబు త‌న‌ను వాడుకుని వ‌దిలేస్తార‌ని చాలా మంది చెప్పారు..

pavan kalyan
pavan kalyan

విశాఖ: బుధవారం విశాఖలో జనసేన సమన్వయకర్తల సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనను వాడుకుని వదిలేస్తారని చాలామంది చెప్పారని, తనకు తెలియదా? అన్నీ తెలియకుండానే రాజకీయాల్లోకి వస్తామా? అని పవన్ అన్నారు. సొంత మనుషులు అనుకున్నవాళ్లే దెబ్బ కొట్టినప్పుడు బయటవాళ్లు ఎందుకు కొట్టరని ప్రశ్నించారు. ఎదగడానికే ముందొచ్చిన మహా వృక్షాలకు మోకరిల్లాలని, ఏ పార్టీని తక్కువగా అంచనా వేయనని, ఏపార్టీ అనుభవం ఆపార్టీదేనని పవన్ తెలిపారు. జవాబుదారీతనం ఉన్న రాజకీయ వ్యవస్థ రావాలని, చంద్రబాబుకు అనుభవం ఉంది కాబట్టే మద్దతిచ్చానని అన్నారు. తాను మోదీని కలిస్తే దేశద్రోహం చేసినట్లు కొందరు ట్వీట్‌ చేశారని, సినిమా తీయడానికి ఎంతో మేథస్సు ఉండాలని… కోట్ల మంది ప్రజలను పాలించాలంటే ఎంతో శక్తి ఉండాలని పవన్‌ పేర్కొన్నారు. సినిమాల కన్నా నమ్ముకున్న ఆశయమే ముఖ్యమని, మార్పు కోసమే జనసేన పార్టీ ఆవిర్భావం జరిగిందని, జనసేన భావజాలాన్ని కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లాలని పవన్‌ పిలుపునిచ్చారు.