చంద్ర‌బాబుకు బ‌హిరంగ లేఖ

Babau, Jagan
Babau, Jagan

చంద్ర‌బాబుకు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ బ‌హిరంగ లేఖ

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ బ‌హిరంగ లేఖ రాశారు. గ‌త వారం రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌తో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని, వ‌రి, వేరుశెనగ, ఇతర నూనె గింజలు, పత్తి, ఉల్లి, మిరప, మినుము, కంది, మొక్కజొన్న, ఆముదం, ఇతర పంటలు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయ‌ని అన్నారు. వ‌ర్షం కార‌ణంగా న‌ష్ట‌పోయిన రైతుల‌ను త‌క్ష‌ణ‌మే ఆదుకోవాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు.