చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సాహిస్తున్నారు: సీపీఐ నేత రామకృష్ణ

Ramakrushna
Ramakrushna

నంద్యాల ఉప ఎన్నికలో ఓటుకు నోటులో భాగంగా రూ.300 నుంచి 3,000 వరకు పంచిన చంద్రబాబు
ధనబంతో నంద్యాలలో గెలిచిన సంగతి అందరికీ తెలుసు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు.
వియవాడలో సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్‌లో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
‘ఓటుకు రేటు పెంచినందున నంద్యాల ప్రజలే చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పాలి. 50 మంది ఎమ్మెల్యేలు,
20 మంది మంత్రులు, చోటా, బడా లీడర్లు వందలాది మంది నంద్యాలలో మకాం మార్చారు. 10వేల పెన్షన్లు,
వందల కోట్ల రూపాయలు, కోట్ల అభివృద్ధి పనులకు నిధులు ఇస్తామని ఎన్నికలల్లో గెలిచారు.చంద్రబాబు దురాశ
తగ్గలేదు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్పాహిస్తున్నారని తద్వారా ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారని సీపీఐ నేత
మండిపడ్డారు. ఇప్పటికే 21 మంది ఎమ్మెల్యేలను కోనుగోలు చేసి చంద్రబాబుకు దురాశ తగ్గలేదు. ఇకనైనా తీరు
మార్చుకోకుంటే ఆయనను ప్రజలు విశ్వసించరని రామకృష్ణ హితవు పలికారు.