చంద్రబాబు పరాభవం నుంచి తేరుకోలేకపోతున్నారు

ummareddy venkateswarlu
ummareddy venkateswarlu, ysrcp senior leader


అమరావతి: ఏపి కేబినెట్‌ సమావేశం నిన్న విజయవంతంగా జరిగిందని వైఎస్‌ఆర్‌సిపి సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేబినెట్‌ సమావేశంలో మంత్రులు, అధికారులకు జగన్‌ దిశా నిర్ధేశం చేశారు.
ఘోరపరాభవం నుంచి చంద్రబాబు ఇంకా తేరుకోలేదని, ఏకపక్షంగా ఏ ప్రాజెక్టును ఆపలేదని, ఐదేళ్లలో చంద్రబాబు ప్రారంభించిన ప్రాజెక్టులేవీ లేవన్నారు. చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతిపై సమీక్ష జరుపుతామని జగన్‌ ఎన్నికల్లో చెప్పారని ఉమ్మారెడ్డి స్పష్టం చేశారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos