చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయలను నడుపుతున్నాడు
న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ వ్యక్తిని కాంగ్రెస్లోకి పంపి చంద్రబాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకన్నారని బిజెపి నేత సోమువీర్రాజు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్న బతికించేందకు ప్రయత్నించారని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ ఆశయాలను కాలరాసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని సోమువీర్రాజు అన్నారు. చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలను నడుపుతున్నారని ఆయన దుయ్యబట్టారు.