చంద్రబాబుపై మేకపాటి ధ్వజం

Mekapati Rejamohan reddy
Mekapati Rejamohan reddy

అమరావతి: ఏపి సియం చంద్రబాబు గ్రామ సర్పంచ్‌ పదవికి కూడా పనికిరాడని వైఎస్‌ఆర్‌సిపి నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈ రోజు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఏపి రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కోసం వైఎస్‌ఆర్‌సిపి ఈ ఉదయం న్యూఢిల్లీలోని సన్సద్‌మార్గ్‌ వద్ద మహాధర్నా చేపట్టారు .ఈ ధర్నాలో వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు. ఈ సందర్భంగా బాబుపై మేకపాటి ధ్వజమెత్తారు. హామీలను నెరవేర్చడంలోనూ, ధీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని ఒప్పించడంలోనూ బాబు ఘోరంగా విఫలమయ్యారని మేకపాటి విమర్శించారు.