చంద్రబాబుపై కేసిఆర్‌ వ్యాఖ్యలు గర్హనీయం:టిడిపి

TDP
TDP

హైదరాబాద్‌: ఆదివారం సిఎం కేసిఆర్‌..చంద్రబాబునాయుడ బీరాలు పలుకుతారని..పనులు చేయరని హేళనగా మాట్లాడడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని టిఎన్‌టియూసి రాష్ట్ర అధ్యక్షుడు బిఎన్‌.రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్‌భవన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ఉమ్మడి ఎపికి సిఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో స్వయంగా కేసిఆరే చంద్రబాబునాయుడు మంచ విజన్‌ ఉన్న సిఎం అని మాట్లాడలేదా? 2009లో మహాకూటమి సందర్బంగా బహిరంగ సభలో ఏపి బడ్జెట్‌లో రూ.10 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్లకు పెరిగిందంటే అది చంద్రబాబు చలవేనని చెప్పలేదా? అని బిఎన్‌.రెడ్డి ప్రశ్నించారు. సమైక్య ఏపిలో చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు ఏవిధంగా అభివృద్ది చేశారో ప్రపంచంలోని భారతీయులందరికీ తెలుసునన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఒక్క ఎకరరానికైనా నీళ్లు ఇచ్చారా? ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న పోలవరం ప్రాజెక్టును ఏపి ప్రభుత్వం ఉరకలెత్తిస్తుందన్నారు. చంద్రబాబునాయుడు చేతల మనిషే కానీ కేసిఆర్‌లా మాటల మనిషి కాదన్నారు.