చంద్రబాబును గద్దె దించడమే ధ్యేయంగా పనిచేస్తా

motkupalli narasimhulu
motkupalli narasimhulu

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును గద్దె దించడమే ధ్యేయంగా ఇకపై తాను పనిచేస్తానని తెలంగాణ టిడిపి బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు. మోత్కుపల్లి నర్సింహులు తిరుమల యాత్ర నేపథ్యంలో వైఎస్సార్సీ ఎంపి విజయసాయిరెడ్డి మోత్కుపల్లిని ఆయన నివాసంలో కలిసారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీ తరుపున సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అనంతరం తన నివాసంలో మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. అవసరమైతే ఏపిలోని విపక్షాలన్నింటితో కలిసి తాను పనిచేయనున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో చీడపురుగుల్లా తయారవుతున్నాడని, అల్లుడు వేషంలో ఎన్‌టిఆర్‌ను చంపి టిడిపి జెండాను ఎత్తుకెళ్లాడన్నారు. ఆ జెండా చూసే జనాలు ఓట్లేశారన్నారు. టిడిపి నుంచి చంద్రబాబును ఎన్‌టిఆర్‌ బహిష్కరించారన్నారు. బాబుకారణంగా ఎన్‌టిఆర్‌ శిష్యులు చనిపోయారన్నారు. ఎన్‌టిఆర్‌ లాంటి మహానీయుడు మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. చంద్రబాబును నాయకుడు ఎవరూ అనరని ఓ బ్రోకర్‌ అన్నారు. ఎన్‌టిఆర్‌ మీద అభిమానంతోనే పార్టీలో కొనసాగగా, ఎన్‌టిఆర్‌ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న నన్ను చంద్రబాబు పార్టీకి దూరం చేశారన్నారు. వేరే పార్టీల నుంచి ఆహ్వానాలు అందినా ఏ రోజు గురించి ఆలోచించలేదన్నారు. ఇన్ని సంవత్సరాలలో తాను ఏ పదవి ఆశించలేదని, రాజకీయాల కోసం నన్ను కరివేపాకులా చంద్రబాబు వాడుకున్నాడన్నారు. ఎప్పుడైతే నన్ను పార్టీలోంచి సస్పెండ్‌ చేసిందో అప్పుడో నీ పతనం ప్రారంభమైందన్నారు. నీతిమంతులపై నిందలేస్తే పుట్టగతులు లేకుండా పోతావని విరుచుకుపట్టారు. ఏపికి ప్రత్యేక హోదా విషయంలో అడ్డుతగులుతుంది చంద్రబాబేనని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు. ప్యాకేజీ ముందు అని అసెంబ్లీ తీర్మాణం చేసింది చంద్రబాబు అని, రైతుల భూముల విషయంలో అడ్డగోలు అవినీతి జరిగిందన్నారు. సింగపూర్‌, అమెరికా అంటూ కథలు చెబుతూ ఐదు సంవత్సరాలలో చంద్రబాబు సాధించింది ఏమీ లేదని, పదవి కోసం దిగజారుడు రాజకీయ చేశావన్నారు.