చంద్రబాబుకు ఆశ వర్కర్ల సత్కారం

Chandrababu
Chandrababu

విజయవాడ: ఆశా వర్కర్ల సమ్మేళనం ఈరోజు సాయంత్రం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రారంభమైంది. ఈకార్యక్రమానికి సిఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సమ్మేళనానికి ప్రతి జిల్లా నుంచి 500-1000 మంది పాల్గొనేలా ఆరోగ్యశాఖ ప్రణాళిక రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు రూ.3,000 గౌరవ వేతనం ఇస్తోంది. గతంలో ఇలా ఆశాలకు ఫిక్సిడ్‌గా కొంతమొత్తం ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ సందర్భంగా సమ్మేళనం వేదికగా ఆశా వర్కర్లు చంద్రబాబును సత్కరించనున్నారు.