చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయం మూసివేత

Yadadri Temple
Yadadri Temple

యాదాద్రి: ఈ నెల 16న రాత్రి 1.20 నిమిషాలకు చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని మూసివేయనున్నారు. 16న సాయంత్రం 6.30 నిముషాలకు ఆలయం మూసివేసి, తిరిగి 17న ఉదయం 5.30కు ఆలయ అర్చకులు సంప్రోక్షణ చేసి తెరవనున్నారు. 17న ఉదయం 9 గంటల నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభం కానున్నాయి. చంద్రగ్రహణం నేపథ్యంలో ఆలయంలో ఆర్జిత సేవలను నిలిపివేశారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/