ఘ‌నంగా యూత్ ఫ‌ర్ సేవా వార్షికోత్స‌వం

anniversary
anniversary

హైద‌రాబాద్ః అమీర్‌పేటలోని హోటల్‌ మినర్వా గ్రాండ్‌లో ఆదివారం రాత్రి యూత్ ఫర్‌ సేవా 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంస్థ వాలంటీర్లు చేసిన నృత్యాలు, ఆటపాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. నగర వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచిహాజరైన విద్యార్థులు చేసిన క్లాసికల్‌, గ్రూప్‌ డ్యాన్సులు, నృత్యరూపకాలు హోరెత్తించాయి. ఈ సందర్భంగా యూత్ ఫర్‌ సేవా సిటీ కో-ఆర్డినేటర్‌ వెంకట్‌ మాట్లాడుతూ 2007 నగరంలో ప్రారంభించిన తమ సంస్థలో నగర వ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాలలకు చెందిన సుమారు 400 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా చేరి సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచు కుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్ల మేనేజ్‌మెంట్‌ నిర్వాహకులు మహేందర్‌, తరుణ్మయి, హేమంత పాల్గొన్నారు.