ఘనంగా సంతోషం అవార్డుల ప్రదానం

NAGA CHAITANYA
Allu Aravind, Boyapati Srini, Naga Chaitanya

ఘనంగా సంతోషం అవార్డుల ప్రదానం

సినీ, రాజకీయప్రముఖుల సమక్షంలో సంతోషం 15వ వార్షికోత్సవ: సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్స్‌ అవార్డుల ప్రదానం వైభవంగా జరిగింది.. ఇక్కడి గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో విశేషం సంఖ్యలో ఫిల్మ్‌ అభిమానులు పాల్గొన్నారు.. ఈ ఏడాది ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ప్రేమమ్‌) ఎంపికయ్యారు.. ఉత్తమ దర్శఖుడిగా సరైనోడు చిత్రానికి బోయపాటి శ్రీను, స్టార్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటిగా సమంత కథానాయికతగా నటించిన ‘అ..ఆ చిత్రానికి దక్కింది.. ఉత్తమ దర్శకుడిగా సరైనోడు చిత్రానికి బోయపాటి శ్రీను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని చేతులమీదుగా అవార్డు అందుకున్నారు.. ఇకత ఉత్తమ చిత్రం అవార్డును జాతీయ అవార్డుతో సంచలన సృష్టించిన ‘పెళ్లిచూపులు చిత్రం కైవసం చేసుకుంది.. ఆ చిత్ర నిర్మాత రాజ్‌ కందుకూరిబోయపాటిచేతుల మీదుగా అందుకున్నారు.దాసరి నారాయణరావు స్మారక అవార్డు అల్లు రామలింగయ్య స్మారక అవార్డులతోపాటు ఇతర భాషలకు చెందిన నటీనటలను సంతోషం అవార్డులతో ఘనంగా సత్కరించారు. కాగా బ్యూటీఫుల్‌ హీరోయిన్లు మన్నారా చోప్రా, రిచా పన§్‌ు, అనసూయ స్పెషల్‌ ఫెర్ఫామెన్స్‌తో వేడుకకు మరింత శోభ తెచ్చారు.
అవార్డుల ప్రదానం అనంతరం హీరో నాగచైతన్య మాట్లాడుతూ, 15 ఏళ్లుగా సంతోషం వార్షికోత్సవాలను క్రమంతప్పకుండా నిర్వహించటం అంటే చిన్న విషయం కాదని, ప్రతి ఏటా సంతోషం వార్షికోత్సవాలు ఎక్కడా తగ్గకుండా సురేష్‌గారు ఎంతోగొప్పగా చేస్తున్నారని అన్నారు. అందుకు చాలా సంతోషంగా ఉందని, తనకు ఈ అవార్డు దక్కిందంటే కారణం నేను కాదు.. ప్రేమమ్‌ సినిమానే అన్నారు.. మలయాళం వెర్షన్‌ తనను సినిమా చూసిన ఆడియన్స్‌నుఎంతో ఇన్‌స్పైర్‌ చేసిందన్నారు.. క్రిటిక్స్‌కూడ ఎంతో ఎంకరేజ్‌ చేశారన్నారు. అందుకే ఈ అవార్డు వచ్చిందన్నారు.. అలాగే సమతం ఇంటి నిండా అవార్డులేనని అయితే ఇపుడు ఆజాబితాలో సంతోషం అవార్డు కూడ చేరిందన్నారు.
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ, సంతోషం 15 సంవత్సరాలు పూర్తిచేసుకుని16వ ఏడాదిలోకి అడుగు పెట్టటం చాలా సంతోషంగా ఉందన్నారు.. ఇలాగే సురేష్‌గారు మరిన్ని వార్షికోత్సవాలు జరపాలన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ మాట్లాడుతూ, పెద్దలు రామానాయుడు, కృష్ణ, ఎఎన్నార్‌,ఎన్టీఆర్‌ వంటి దిగ్గజాల కృషి వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలిరావటం జరిగిందన్నారు. వాళ్ల కృషి ఎన్నటికీ మరువలేనిదని అన్నారు. ఇక తెలుగుసినిమా ఇండస్ట్రీ రోజురోజుకీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు.. ఇవాళ తెలుగు ఇండస్ట్రీ అంటే ప్రపంచం మొత్తం తెలిసిందన్నారు.. దానికి కారణం బాహుబలి సినిమా.అన్నారు..ఇలాంటి సినిమాలు మరిన్ని రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.. కొత్తవాళ్లు సక్సెస్‌ అవుతున్నారన్నారు. అందువల్ల ఉపాధి కూడ పెరుగుతుందన్నారు. ఇది ఇండస్ట్రీకి శుభసూచికమని అన్నారు. తెలంగాణ ప్రభత్వుం నుంచి సినిమా ఇండ్రస్టీకి ఎప్పటికీ సహకారం ఉంటుందన్నారు..సంతోషం గురించి మాట్లాడుతూ చిన్నవాడైన సురేష్‌ పెద్దసాహసాలు చేస్తుంటాడని, జర్నలిస్టుస్థాయి నుంచి ఈ రేంజ్‌కి వచ్చాడంటే అతను ఏ స్థాయిలో కష్టపడ్డాడో అర్ధమవుతుందన్నారు.. 15ఏళ్లుగా అవార్డులు అందజేయటం చిన్న విషయం కాదని, కానీ అన్నీ తానే అయి చేసుకోవటం మరో గొప్ప విషయమన్నారు..
ఎపి మంత్రి గంటాశ్రీనివాసరావు మాట్లాడుతూ, వైజాగ్‌లో కూడ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అభివృద్ధి పరిచే దిశగా ఆలోచనచేస్తున్నామన్నారు. అక్కడ అందమైన లొకేషన్స్‌ ఉన్నాయని, 20శాతం సినిమా షూటింగ్‌లుఅక్కడ కూడ చేయాలని దర్శక, నిర్మాతలను కోరుతున్నాని అన్నారు. సింగిల్‌విండో అనుమతులిస్తామని అన్నారు.
ఎంపి మురళీ మోహన్‌ మాట్లాడుతూ, దేశంలో ఫిలిం ఫేర్‌ తర్వాత సౌత్‌లో ఇంత గ్రాండ్‌గా అవార్డులు అందించేది ఒక్క సంతోషం మాత్రమే అన్నారు.. దాసరిగారి పేరిట అవార్డుల అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.. తొలి ఏడాదే దాసరి స్మారక నటుడు అవార్డు తనకు రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, నిర్మాతల అల్లు అరవింద్‌, అలనాటి నటి రోజా, నటుడు సప్తగిరి, నిర్మాత రాజ్‌ కందుకూరి, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడారు.
మా అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ, సురేష్‌ ప్రతిఏటా ఎంతో గొప్పగా అవార్డులను అందిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అలాగే మా కుటుంబ సభ్యులను కూడ ఆర్థికంగా ఆదుకున్నారన్నారు..ఇవాళ కూడ కొత్త మంది బాధిత కుటుంబాలకు చెక్కులను అందించటం జరిగిందన్నారు. మా జనరల్‌ సెక్రటరీ నరేష్‌, హీరోలు విజ§్‌ు అంటోనీ, అది పినిశెట్టి, శిరీష్‌, ఆనంద్‌ కృష్ణన్‌, సన్యక్త్‌ హెగ్డే, భారతీ విష్ణువర్ధన్‌, చక్రపాణి, రోషన్‌, ఆర్మాన్‌ మాలిక్‌, రమేష్‌ ప్రసాద్‌, విద్యల్లేక రామన్‌, మల్కాపురం శివకుమార్‌, మన్నారా చోప్రా, అనసూయ, వీడవడు సినిమా టీమ్‌ తాతినేని సత్య, శివ, రవికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.
===========
సంతోష్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు
భారతీ విష్ణువర్ధన్‌, 50 ఏళ్ల సినీ కెరీర్‌ పూర్తిచేసుకున్న సందర్భంగా రోజారమణి ఎంపికయ్యారు.
దివంగత దాసరి నారాయణరావు పేరున ఈ ఏడాది నుంచే స్మారక అవార్డులను కూడ సంతోషం అధినేత సురేష్‌ అందిస్తున్నారు. మొత్తం నాలుగు విభాగాల్లో దాసరి స్మారక అవార్డులను అందించారు.
దాసరి స్మారక (నిర్మాత): అల్లు అరవింద్‌
దాసరి స్మారక (నటుడు): మురళీమోహన్‌
దాసరి స్మారక (రచయిత): పరుచూరి బ్రదర్స్‌
దాసరి స్మారక (జర్నలిస్టు): పసుపులేటి రామారావు
కాగా ఏటా అందించే అల్లు రామలింగయ్య స్మారక అవార్డును ఈ ఏడాది కమెడియన్‌ సప్తగిరికి అందజేశారు..
===
ఉత్తమ నటుడు: నాగచైతన్య (ప్రేమమ్‌)
ఉత్తమ నటి: సమంత (అ..ఆ)
స్పెషల్‌ జ్యూరీ అవార్డు: మన్నారా చోప్రా
ఉత్తమ దర్శకుడు: బోయపాటి శ్రీను (సరైనోడు)
ఉత్తమ దర్శకుడు (డెబ్యూ): తరుణ్‌భాస్కర్‌ (పెళ్లిచూపులు)
ఉత్తమ చిత్రం: పెళ్లిచూపులు
ఉత్తమ నిర్మాత: రాజ్‌ కందుకూరి
ఉత్తమ కమెడియన్‌: ఫీమేల్‌) విద్యుల్లేఖ రామన్‌ (సరైనోడు)
క్రిటిమ్‌్‌స ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌: బెల్లం రామకృష్ణారెడ్డి (దృశ్యకావ్యం)
ఉత్తమ జర్నలిస్టు: భాగ్యలక్ష్మి
ఉత్తమ విలన్‌: ఆది పినిశెట్టి (సరైనోడు)
ఉత్తమ నటుడు(తమిళ్‌):శిరీష్‌ (మెట్రో)
ఉత్తమ దర్శకుడు (తమిళ్‌): ఆనంద్‌ కృష్ణన్‌
ఉత్తమ నటి (కన్నడ): సన్యక్త్‌ హెగ్డే