గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్‌ను క‌లిసిన సిబిఐ మాజీ డైర‌క్ట‌ర్ జె.డి

J D Laxnarayana & Vidyasagar
J D Laxnarayana & Vidyasagar

స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తారంటూ ఊహాగానాలు మొదలైన విషయం తెలిసిందే. పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఆయన మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. పలు అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది. కాగా, ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు కూడా కొందరు భావిస్తున్నారు. సహజంగానే సమాజం గురించి ఏదైనా చేయాలన్న తపన ఉన్న లక్ష్మీ నారాయణను బీజేపీలో చేర్చుకోవడానికి కొందరు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. రాజకీయ రంగ ప్రవేశంపై లక్ష్మీ నారాయణ మాత్రం ఇంతవరకు ఏ ప్రకటనా చేయలేదు. ఆయన తదుపరి ఏ రంగంలో కొనసాగుతారన్న ఆసక్తి నెలకొంది.