గ‌ల్ఫ‌లో ఉద్యోగాలంటూ టోక‌రా

Fraud
Fraud

కరీంనగర్ : ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే అమాయకులను ఆసరాగా చేసుకొని అక్కడ ఉ ద్యోగాలిప్పిస్తామని మోసం చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంకమ్మతోటకు చెందిన ముజమల్ కొం తకాలం కిందట దుబాయి వెళ్లి కొన్ని నెలల పాటు ఉద్యోగం చేశాడు. గతేడాది వచ్చి తిరిగి వెళ్లేందుకు నెట్‌లో శోధించి బయోడేటా పంపాడు. బయోడేటా పంపిన కంపెనీ నుంచి వీసా పంపిస్తామని రూ. లక్ష కట్టి ముంబైలో ఇంటర్వ్యూకు రావాలని సూచించారు. మీ సంబంధీకులు ఎవరైనా ఉంటే పంపాలని కమిషన్ ఇ స్తామని ఆశ జూపారు. దీంతో ముజమల్ పూర్తి స్థా యిలో ఏజెంట్‌గా పని చేస్తూ సుమారు 30 మందిని నమ్మించి రూ. 30 లక్షలు తమ బ్యాంకు ఖాతాలో జమ చేయించుకున్నాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అస్లాం, జార్ఖండ్‌కు చెం దిన సల్మాన్ మజమల్ ద్వారా అమాయకులను నమ్మించి ఈ డబ్బులు దండుకున్నారు. అనంతరం దుబాయి కంపెనీల పేరుతో వీసాలు సృష్టించి ఆన్‌లైన్‌లో వీసాలు, టికెట్ పంపేవారు. ముంబైలో మకాం వేసిన ఈ ముఠా కర్ణాటక నుంచి 8 మంది, హార్యానా 10, గుజరాత్ నుంచి 15, కేరళ 5, తమిళనాడులో ఒకరిని పంజాబ్‌లో 15, మహారాష్ట్రలో 6గురిని నమ్మించి మోసం చేశారు. ఆన్‌లైన్ చీటింగ్ పేరిట ఓ బాధితుడు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాసరావు బృందం ముంబైలో అస్లాం, సల్మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 2 లాప్‌టాప్‌లు, డైరీలు, ఫోన్‌లు స్వా ధీనం చేసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలి స్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.