గన్ మెన్లను వెనక్కి పంపిన పవన్

హైదరాబాద్ః నెల రోజుల క్రితం గన్మెన్లను కేటాయించాలని ఆ రాష్ట్ర డీజీపీకి పవన్ లేఖ రాశారు. దాంతో ఇటీవలే పవన్ భద్రతకు సంబంధించి నలుగురు గన్మెన్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన గన్మెన్లను జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న రాత్రి వెనక్కి పంపించారు. గన్మెన్లను వెనక్కి పంపడంపై పవన్ కల్యాణ్ కారణాలను వెల్లడించలేదు.