గ్రేటర్‌ బరి నుంచి వైకాపా ఔట్‌

 

ysr
హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల బరినుంచి వైకాపా తప్పుకుంది. ఆ పార్టీ తెలంగాన అధ్యక్షుడు పొంగులేటి కొద్దిసేపటి క్రితం ఈ విషయాన్ని గ్రేటర్‌ కేడర్‌కు తేల్చిచెప్పారు. గ్రేటర్‌ ఎన్నికల బరి నుంచి వైకాపా తప్పుకుంటున్నట్టుగా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గ్రేటర్‌ ఎన్నికల్లో వైకాపా పోటీచేయదని తెలిసిపోవటంతో గ్రేటర్‌హైదరాబాద్‌లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రఅసంతృప్తివ్యక్తం చేస్తున్నారు.