గ్రూప్‌-2 మెరిట్‌ జాబితా విడుదల

students (file)
students (file)

గ్రూప్‌-2 మెరిట్‌ జాబితా విడుదల

అమరావతి: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1999 గ్రూప్‌-2 నోటిఫికేషన్‌లోని ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు 15 ఏళ్ల అనంతరం 927 మందితో కూడిన మెరిట్‌ జాబితాను ఎపిపిఎస్సీ రూపొందించింది.. ఈజాబితాను జోన్ల వారీఆ, పోస్టులవారీగా ఎంపికకైన అభ్యర్థుల వివరాలను psc.ap.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరించరాఉ.. 1999గ్రూప్‌-2 నోటిషికేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నిర్ణయించి ఎపిపిఎస్సీ పరీక్ష నిర్వహించింది.. తర్వాత మరికొన్ని పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేసింది.. అయితే ఈ విషయంలో నిబంధనలు పాటించలేదని, మెరిట్‌లో ఉన్న తమకు అన్యాయం జరిగిందని కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించటంతో అది సుప్రీం వరకు వెళ్లి ఏడాదిన్నర క్రితం తీర్పు వెలువడింది.. తాజా ఇపుడు ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు 927 మందితో మెరిట్‌ జాబితా రూపొందించింది.. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు కూడ త్వరలోనే ఈ జాబితాను ప్రకటిస్తామని పర్కొంది.