గ్రూప్‌-2 ఫ‌లితాలు వెంట‌నే ప్ర‌క‌టించాలిః కృష్ణ‌య్య‌

Career
Career

హైద‌రాబాద్ః ప్రభుత్వం గ్రూప్‌-2 ఫలితాలను వెంటనే ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో గ్రూప్‌2 సెలెక్టెడ్‌ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం హైకోర్టు స్టేను ఎత్తివేయించి గ్రూప్‌2 ఫలితాలను తక్షణమే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గ్రూప్‌2లో 3వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని కూడా వెంటనే భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రంలో 80వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని, ఇందులో భాగంగానే ఉపాధ్యాయ పోస్టులను కుదిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.