గ్రామీణ్‌డాక్‌సేవక్‌లకు వేతనపెంపు

India post
India post

న్యూఢిల్లీ: గ్రామీణప్రాంతాల్లో పనిచేసే గ్రామీన్‌ డాక్‌సేవక్‌(పోస్ట్‌మాన్‌)ల జీతాలను నెలకు రూ.14,500కు పెంచింది.కేంద్రకేబినెట్‌ ఈమేరకు వారి వేతనాలను సవరించింది. జనవరి ఒకటి 2016నుంచి ఈ వేతనాలు అమలవుతాయని కమ్యూనికేషన్స్‌ మంత్రిమనోజ్‌సిన్హా వెల్లడించారు. జిడిఎస్‌లుగా పిలుచుకునేగ్రామీణ్‌ డాక్‌సేవక్‌లు నెలకు ఇప్పటివరకూ 2295మాత్రమే పొందుతున్నారు. ఇకపై వీరికి రూ.10వేలు పొందుతారు. ఎవరికైతే 2775రూపాయలు వేతనం అందుతున్నదో వారికి రూ.12,500లభిస్తుందని, రూ.4,115ల వేతనం పొందేవారికి నెలకు రూ.14,500 వేతనం లభిస్తుందనిమంత్రి వివరించారు. కేంద్రకేబినెట్‌ మొదటిసారిగా జిడిఎస్‌లకు రిస్క్‌,పనిభారం భత్యాలనుసైతం కేటాయించింది. అయితే ఈ గ్రామీణ డాక్‌సేవక్‌లురెండుషిప్ట్‌లలో పనిచేస్తారు. ఇప్పటివరకూ ఉన్న మూడు షిప్ట్‌లను రెండు షిప్ట్‌లకు కుదించారు. అంతేకాకుండా జిడిఎస్‌పై ఆధారపడిన కుటుంబసభ్యులకు కాంపెన్సేటరీ నియామకాన్నిసైతం కేబినెట్‌ ఆమోదించింది. అలాగే కరువుభత్యం ప్రత్యేకించి విడిగా చెల్లిస్తారని అన్నారు. మొత్తం గ్రామీణ్‌డాక్‌సేవక్‌లు భారత్‌లో 3.07 లక్షలమందిపనిచేస్తున్నారు. ప్రభుత్వం వేతనపెంపు వీరందరికి పెద్ద ఊరటనిచ్చినట్లయింది.