గ్రామీణాభివృద్ధిలో సాంకేతిక సౌకర్యాల పాత్ర
వుం
నేడు భారత గ్రామీణ వ్యవస్థలో సాంకేతిక అభివృద్ధి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. గతంలో కమ్యూనికేషన చేరాలంటే రోజులు పట్టేది. కాని నేడు క్షణాలలో సమాచారం చేరవేయడం జరుగుతుంది. నేడు భారతదేశంలో 92 కోట్ల మందికి సెల్ఫోన్లు అందుబాటులో కొచ్చాయి. అందులో 40 కోట్ల మందికి రెండు కంటే ఎక్కువ సెల్ఫోన్లు వాడుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. దానితో సమాచారం క్షణాలలో చేరుతుంది.ఉదా. ఈశాన్య భారత రాష్ట్రమైన మిజోరంలో భూకంపం సంభవించిన వెంటనే విజయవాడ, హైదరాబాద్‌లో ఉన్న వారికి తెలిసిపోయింది. ఎందుకంటే ఆంధ్ర కంపెనీలు రోడ్లనిర్మాణం, టెలిఫోన్లు, కమ్యూని కేషన్ అభివృద్ధిరంగంలో పనిచేస్తున్నాయి. దానివలన మన వారు సురక్షితంగా ఉన్నారని తేలింది. మరోవిధంగా కూడా కమ్యూనికే షన్స్ గ్రామాలకు చేరుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా దేశాలలో నలుమూలలో ఏమి జరుగుతుందో తెలిసిపోతుంది. సోషల్ మీడియా, ఫేస్బుక్, గూగుల్, ఇతర సాధనాల ద్వారా సమాచారం ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు చేరుతుంది.
కుటుంబాలకు సెల్ఫోన్లుఅవసరమే.కాని కుటుంబానికి సెల్‌ఫోన్ అందుబాటులోకి రావడం వలన మానవ సంభందాలు మట్టి కలుస్తున్నాయని ఒకతరంవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెల్‌ఫోన్ అందుబాటులోకి రావడంవల్ల మానవ సంబంధాల మధ్య మాటలు కరువైపోయాయి.గ్రామాల్లోని కుటుంబసంబంధాలు దెబ్బ తింటున్నాయి. గ్రామా లలో టెలివిజన్ ఒక్కటే కాడు సెల్ఫోన్లు కూడా ఎక్కువగా ప్రభావాన్ని చూపుతున్నాయి. కుటుంబాలకు ఆద రణ లేకుండాపోతోంది. ఫోన్లో మాట్లాడుకుంటే సరిపోతుంది, ఇంటికి వెళ్లి సమయాన్ని వృధాచేయడం ఎందుకనే ఆలోచనకు వస్తున్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం వలన లాభం, నష్టం ఉన్నా కొత్తగా వచ్చే మార్పులను ఆకళింపు చేసుకోవాలి. గ్రామాల లో అంత అవగాహన ఉన్నవారు తక్కువ. కనుక సమస్యలను వివ రించి చెప్పేవారు దొరకరు. దానితో గ్రామీణ ప్రజలు ఏది నిజం? ఏది అపకారం చేస్తుందో తెలియక నిస్తేజంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జరిగేనష్టం వాటిల్లేది వాటిల్లుతుంది.
టెలివిజన్ ప్రకటనలు నమ్మిమోసపోయే వాళ్లు ఎక్కువుతున్నారు. దాన్ని కౌంటర్ చేయాల్సిన అవశ్యకత ఉంది. టెలివిజన్ బూమ్ పట్టణాలను వదలి గ్రామాలకు చేరింది. అందుకు కారణం సాంకేతిక అభివృద్ధిలో భాగమైన టెలివిజన్, కేబుల్ నెట్‌వర్క్‌ల ద్వారా సిని మాలు, సీరియళ్లు చూసి అవే నిజమని నమ్మె మహిళలు అధికమై పోయారు. టెలివిజన్ ప్రసారాలు చేయడం వలన మేలుకంటే కీడు ఎక్కువగా జరుగుతుంది.మన టెలిజన్లో ప్రసారమవ్ఞతున్న సీరియ ల్స్లోస్త్రీ-పురుషుల మధ్య అక్రమసంబంధాలు, సంతానం తదితర అంశాలను సీరియస్‌గా చూపడంవలన అవే నిజమనుకొని అన్నా- దమ్ముల సంబంధాలు, భార్యభర్తల సంబంధాలు, అత్తా-కోడళ్ల సంబంధాలు దెబ్బతిని ఉమ్మడికుటుంబం అనేదానికితూట్లు పొడుస్తుంది. టెలివిజన్‌లో ప్రసారమయ్యే అంశాలు వాస్తవానికి దగ్గ రగా ఉన్న వాటిని మరింత ఎక్స్పోజ్ చేయడం వలన అవి చదువురాని వారి పై మరింత ప్రభావాన్ని చూపుతున్నాయని నిపుణులు వివరిస్తున్నా రు. ఎక్కడో ఒక సంఘటనను ఆధారంగా టెలివిజన్‌లో చూపించడం వలన ఎమోషన్‌ల్‌గా చూసేవారు ప్రభావితం అవుతున్నారు. మహిళలు ఆ సీరియల్స్ వచ్చే సమయంలో పిల్లలను, భర్తలను ఇంటి పనులకు స్వస్తిచెప్పి టెలివిజన్ముందే అతుక్కుపోయి చూస్తున్నారు. ఇంట్లో వారి మధ్య వచ్చేవారం ఏం జరుగుతుందో అనే చర్చలకు దారితీస్తుంది. చదువుకోని ఆడవారు కూడా ఆ సీరియల్స్‌ను కోడ్ చేస్తూ మాట్లాడుతున్నారు. కేబుల్ టెలివిజన్‌లో ప్రసారాలలో చూసి కష్టపడకుండా డబ్బులు సంపాదించడం ఎలా? అనే వికృత ధోర ణులకు యువత పాల్పడుతుంది. టివీలలో ప్రకటనలు చూసి అవే కావాలని యువత వాటిని సంపాదించేందుకు అక్రమ పద్ధతులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. కొంతమంది యువత సినిమాల కోసం ముంబాయి,హైదరాబాద్‌లకు చేరుకొని అన్నీ పోగొట్టుకుం టున్నారు. దీనివలన గ్రామాల సంపద పట్టణాలకు చేరడం పట్టణాల్లో సుఖజీవితం లభిస్తుందని ఆశతో తరలిపోవడం జరుగుతుంది. అంటే టెలివిజన్ ప్రకటనలు గ్రామీణుల మధ్య ఎంత ప్రభావాన్ని చూపుతున్నాయో ఇట్టే అర్థమైపోతున్నది.
మహిళలో ధనికులు అవలంబించే పద్ధతులు,అలవాట్లు నిజమని నమ్మి తమ కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకొంటున్నారని పలు సోషల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. గ్రామాల్లోని ధనికులకు, రాజకీయ నాయకులకు పెద్ద కుటుంబీకులకు చుట్టుపక్కల గ్రామాలలో పలుకు బడి, మద్దతు కోసం సంబంధాలు కొనసాగించడం అతిసహజం. చాలా మంది దానిని అనుకరించి అక్రమ సంబంధాలకు పాల్పడి వారి నిజజీవితాన్ని పాడుచేసుకొంటున్న కుటుంబాలు న్యూక్లియస్ కుటుంబాలుగా మారుతున్నాయి. కుటుంబంలో పెద్దవారిని గౌర వించడం తగ్గిపోయింది. ఈర్ష్యద్వేషాలకు దారితీస్తూ వారికి ఉన్నది మాకు లేదనే చింతన వ్యధతో సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఈ సాంకేతిక అభివృద్ధిద్వారా సాంఘిక సంబంధాలు ఘర్షణలకు, విరో ధాలు అధికమై కక్షలు కార్పణ్యాలకు దారితీస్తున్నాయి. అంటే సాం కేతిక అభివృద్ధి సమాచారంతోపాటు చేటును కూడా అధికం చేస్తుం దనటంలో సందేహం లేదు.సోషల్ మీడియా గ్రామాలలో నివసించే యువతకు పెరాశలు చూపి పక్కదారి పట్టిస్తుంది. అంటే సోషల్ మీడియా ద్వారా గ్రామాలలో సంపద పట్టణాలకు చేరడానికి దోహ దపడుతుందని చెప్పవచ్చు. సోషల్‌మీడియా మార్కెటీకరణ పేరుతో షాపింగ్ మాల్స్, చీరలు, వస్తువులు, చైనాబజార్ లాంటి సంస్థలు బడా కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలు గ్రామాలకు తెచ్చి కూడళ్లు పెట్టి అమ్మకాలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర మోటారు సైకిళ్లు, త్రిచక్ర ఆటోలు, వాటి వెనుక మైక్రోఫైనాన్స్ పేరుతో వడ్డీ వ్యాపారులు గ్రామాలలో ప్రవేశించి అప్పులు ఇస్తున్నారు. ఈ మైక్రో ఫైనాన్స్ వారి వడ్డీ బ్యాంకు వడ్డీకంటే రెండు మూడు వంతులుం టుంది. దానిపై మరల చక్రవడ్డీ తీసుకొన్న అప్పు తీరకపోగా వడ్డీ అసలు కంటే మూడింతలు చెల్లించవలసి వస్తుంది. ఒప్పందం కుదు ర్చుకోవడం ద్వారా అన్ని చెల్లించాలి. లేకుంటే ఇచ్చిన వాహనాన్ని ఇఎంఐ కట్టలేదన్న నెపంతో జప్తు చేయడడం జరుగుతుంది. మైక్రో ఫైనాన్స్ వారు అప్పిచ్చేటప్పుడు అప్పు తీసుకొనేవరకు మాటల తో ఊరించడం జరుగుతుంది. అప్పువసూలు చేసేటప్పుడు కఠినంగా వ్యవహరిస్తారు.ఉదాహరణకు కాల్‌మనీ వ్యవహారాన్నే తీసుకోవచ్చు.
సాంకేతిక గ్రామాలకుచేరి అవసరం లేకున్నా గ్రామీణులకు అంట గట్టి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. అదే జరిగి గ్రామ సంపద గ్రామాలనుండి తరలిపోతుంది. గ్రామాలు వట్టిపోతున్నాయి. గ్రామీణులకు సుఖసంపదలు పొందే స్థితి కోల్పోయి నరకం చూపిస్తున్నాయి.సాంకేతికాభివృద్ధి వలన పుల్లల పొయ్యి స్థానంలో గ్యాస్‌పొయ్యి, కమ్యూనికేషన్ అభివృద్ధితో విద్యుత్ వినియోగానికి ఎక్కువ ఖర్చు అవ్ఞతుంది. సెల్‌ఫోన్ ఛార్జింగ్ ద్వారా గ్రామాలలో విద్యుత్ అధికమవ్ఞతుంది. వినియోగం రెట్టింపు అయి కొరతను సృష్టిస్తుంది. గ్రామాలలో పంపుసెట్లకు విద్యుత్ కొరత అనుకొంటే ఎలక్ట్రానిక్ గార్జెట్స్, టెలివిజన్స్ సెల్ఫోన్ల వలన విద్యుత్ విని యోగం రెండింతలవుతుంది.ఏ విధంగా చూసినా ఆధునిక వసతుల సదుపాయాల వలన మనిషికి సౌక్యం అందేది కొంతైతే వృధాగా వ్యయం అయ్యేది ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా గ్రామ సంపద గ్రామాల నుండి తరలిపోతుంది. మరి కొందరు గ్రామాలను వదలి విదేశాలకు ఎగబాగటం విదేశాల నుండి వచ్చే డబ్బులు ఆధునిక సౌకర్యాల కోసం వెచ్చించిస్తున్నారు. ఈ విధంగా సాంకేతిక అభి వృద్ధితో లాభనష్టాల మధ్య గ్రామీణుల జీవితాలుసాగుతున్నాయి. గ్రామాలలో సాంకేతికత వలన అశాంతి ప్రబలుతుందే కాని మంచి అతి తక్కువగా జరుగుతుంది. పట్టణాలలో ఉండే అవలక్షణాలు గ్రామాలకు చేరుతూ కుటుంబ వ్యవస్థ మీద పడుతుండడంతో కుటుంబ వ్యవస్థ కూలిపోయే ప్రమాదం ఉంది. ప్రతిది డబ్బుతో పోల్చుకోలేము. డబ్బుకంటే మానవ విలువలే ప్రధానం. డబ్బు శాశ్వతం కాదు. గ్రామీణలకు శాంతి, విలువలు, సంప్రదాయాలు ప్రధానం. కనుక మన పద్ధతులను నిలదొక్కుకునేట్లు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. అప్పుడే సుఖశాంతంగా నడుస్తాయి. సాంకేతిక లింకు తో గ్రామాలు స్వయం సమృద్ధి పెరిగి మరిన్ని సౌకర్యాలు గ్రామాలకు చేరి గ్రామీణులకు మరింతగా ఉపయోగపడాలని ఆశించటం తప్పుకాదు. కమర్షియల్ కంప్యూటర్స్ బ్యాంకింగ్ చెల్లింపులు, ఖాతాల ద్వారా వెసులుబాటు కలిగిన జీవితం సుఖమయమవుతుంది. గ్రామీణులకు నిధులు, ప్రభుత్వం కల్పించే వసతులు పెన్ష న్స్, పంపిణీ సక్రమంగా జరిగి కంప్యూటర్స్ ద్వారా అవినీతి జర గకుండా దోహదపడవచ్చు.