గ్రామాల‌ని ద‌త్త‌త తీసుకోనున్న నీతా అంబానీ!

neeta ambani
neeta ambani

ముంబ‌యిః ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్‌ అంబానీ సతీమణి, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ గుజరాత్‌లోని
నాలుగు గ్రామాలను దత్తత తీసుకోనున్నారు. బనస్‌కాంతా, పఠాన్‌ జిల్లాల్లో కనీస సదుపాయాలు లేని గ్రామాలను
దత్తత తీసుకోనున్నట్లు వెల్లడించారు. బుధవారం నీతా గుజరాత్‌లోని పలు గ్రామాల్లో పర్యటించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ విషయమై రిలయన్స్‌ ఫౌండేషన్‌ గుజరాత్‌ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని నీతా మీడియా ద్వారా వెల్లడించారు.
ఈ నాలుగు గ్రామాల్లో గృహాలు, పాఠశాలల నిర్మాణం, కనీస వైద్య సదుపాయాల కల్పన, కమ్యూనిటీ హాళ్లను కట్టించనున్నారు.
‘రిలయన్స్‌ ఫౌండేషన్‌ నిర్విరామంగా పనిచేసి మీకు ఇళ్లతో పాటు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటుచేస్తుంది.
మాపై నమ్మకం ఉంచండి. అన్నీ అనుకున్నట్లే జరుగుతాయి’ అని నీతా గ్రామస్థులకు హామీ ఇచ్చారు.